- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోమటిరెడ్డి
దిశ బ్యూరో, నల్లగొండ : నల్గొండ శాసనసభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈరోజు 1.04నిలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అయితే మొదట ఆయనొక్కడే ప్రమాణ స్వీకారం చేస్తారని భావించినప్పటికీ ఆ తర్వాత జరిగిన పరిణామాలతో సుమారు 12 మంది మంత్రులతో కలిపి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
కోమటిరెడ్డితో పాటు ఉమ్మడి జిల్లాకు చెందిన హుజూర్ నగర్ శాసనసభ్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు.. ఈ మంత్రివర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్టీ పార్టీ అధినేత శ్రీమతి సోనియాగాంధీ ఏఐసిసి మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి గాంధీ హాజరవుతున్నారు. డిసెంబర్ 3న ఆయన సుమారు 56 వేల మెజార్టీతో సమీప బీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిపై భారీ మెజార్టీతో విజయం సాధించారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి 1999నుంచి వరుసగా నాలుగు సార్లు నల్గొండ నుంచి విజయం సాధించారు. 1999లో కోమటిరెడ్డి తన సమీప సిపిఎం పార్టీ అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డి పై విజయం సాధించగా 2004లో టిడిపి నుంచి పోటీ చేసిన గుత్తా సుఖేందర్ రెడ్డిపై గెలుపొందారు. ఆ తర్వాత 2009లో సిపిఎం అభ్యర్థి నంద్యాల నరసింహారెడ్డిపై, 2014 లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి పై విజయం సాధించారు. 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన కంచర్ల భూపాల్ రెడ్డి చేతిలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి అపజయం పాలయ్యారు.
ఆ తర్వాత వెంటనే జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో భువనగిరి పార్లమెంట్ సభ్యుడిగా వెంకటరెడ్డి విజయం సాధించారు. వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో కోమటిరెడ్డి ఐటి మరియు ఓడరేవులు, ఇందన సహజ వనరుల శాఖ మంత్రిగా పని చేశారు. మంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్న క్రమంలో నల్గొండ జిల్లా కేంద్రంలో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.