- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీఆర్ఎస్ చేసిన తప్పులను మేం సరిదిద్దుతాం.. కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర అభివృద్ధి కోసం బీఆర్ఎస్ నేతల సలహాలు స్వీకరించేందుకు తాము సిద్ధమని కాంగ్రెస్ కీలక నేత, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. సోమవారం అసెంబ్లీలో కృష్ణా జలాల అంశంలో నిర్వహించిన చర్చలో రాజగోపాల్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతల తొందరపాటు చర్యల వల్లే రాష్ట్రం ఇవాళ ఈ దుస్థితికి వచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పద్దతి మార్చుకొని ప్రభుత్వానికి సపోర్ట్ చేయాలని సూచించారు. ప్రాజెక్టుల పేరుమీద వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి అప్పులు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని అన్నారు.
ఆగమైన తెలంగాణను గాడిన పెట్టే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోందని.. దీనికి మద్దతు ప్రకటించకపోగా.. అడ్డుతగలడం సరికాదని హితవు పలికారు. ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ చేసిన తప్పులను తాము సరిదిద్దుతామని చెప్పారు. తమది అవినీతి చేసే ప్రభుత్వం కాదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వానికి భయపడే ప్రభుత్వం కూడా కాదని హితవు పలికారు. పార్టీ మీటింగులకు వెళ్లడానికి కేసీఆర్‌కు సమయం ఉంది కానీ.. ఇంత కీలక జరుగుతున్న వేళ అసెంబ్లీకి ఎందుకు రాలేదని ప్రశ్నించారు. తప్పు చేశారు కాబట్టే.. అసెంబ్లీకి రావడానికి జంకుతున్నారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ తీవ్ర అన్యాయం చేశారని.. క్షమాపణ చెప్పాకే నల్లగొండకు రావాలని అన్నారు.