'మునుగోడుకు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొస్తా'

by GSrikanth |
మునుగోడుకు రూ.వెయ్యి కోట్ల నిధులు తీసుకొస్తా
X

దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ నేతలపై మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నల్లగొండ ప్రజలంతా బీజేపీ వైపే చూస్తున్నారని తెలిపారు. బీజేపీ నేతలకు పార్టీ మారాలంటూ పోలీసులతో టీఆర్ఎస్ బెదిరింపులకు గురిచేస్తోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, బీజేపీ సభలకు అడ్డుకుంటూ, మనుషులను పెట్టి మా పర్యటనలను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఇక టీఆర్ఎస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. వెయ్యి కోట్ల నిధులను కేంద్రం నుంచి తీసుకొచ్చి మునుగోడును అభివృద్ధి చేస్తా అని హామీ ఇచ్చారు.

Advertisement

Next Story

Most Viewed