- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అప్పు చేసి ఆ పని మాత్రం చేయకండి.. తెలంగాణ రైతులకు కోదండరెడ్డి విజ్ఞప్తి

దిశ, వెబ్‌డెస్క్: వేసవి వేళ తెలంగాణ రైతు(Telangana Farmers)లకు రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి(Kodanda Reddy) కీలక సూచనలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణలో రోజురోజుకూ భూగర్భజలాలు అడుగంటిపోతున్నాయి.. రైతులు అప్పులు చేసి బోర్లు వేయొద్దు. నీళ్లు ఉంటేనే పంటలు వేసుకోండి. ఎండకాలం పంటలు వేసి నష్టపోవద్దని సూచనలు చేశారు. ముఖ్యంగా బోర్లు వేసి అప్పుల పాలు కావొద్దని విజ్ఞప్తి చేశారు. రైతులే ఈ దేశానికి వెన్నెముక అని.. రైతుల ప్రాణం చాలా విలువైనదని అన్నారు. రైతుల మేలు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government), ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేయాల్సింది మొత్తం చేస్తున్నారని అన్నారు.
ప్రస్తుతం మనం ఫిబ్రవరి నెలలో ఉన్నాం.. సాధారణంగా మార్చి తరువాతనే ఎండలు ముదురుతాయి. కానీ అలాంటి పరిస్థితికి భిన్నంగా ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రత వలన.. పంటలు ఎండిపోతున్నాయని.. దాంతో ఇబ్బందులు పడుతున్నట్టు మా కమిషన్ దృష్టికి వచ్చిందని అన్నారు. అందుకే రైతాంగానికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం.. ఈ పరిస్థితుల్లో అప్పులు చేసి బోర్లు వేయకండి అన్నారు. కమిషన్ ఎప్పుడూ రైతాంగం అభివృద్ధి చెందాలనే చూస్తుందని తెలిపారు. ఉన్న పంటలను కాపాడుకోండి. అదనంగా వరి వేయకండి అని సూచించారు.