సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ

by M.Rajitha |   ( Updated:2024-09-15 16:33:24.0  )
సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి లేఖ
X

దిశ, వెబ్ డెస్క్ : సెప్టెంబర్ 17న తెలంగాణ(Telangana) ప్రజాపాలన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఈ క్రమంలో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కేంద్రమంత్రులకు 'ప్రజాపాలన దినోత్సవానికి' రావాల్సిందిగా ఆహ్వానం పంపారు. కేంద్ర మంత్రులు అమిత్ షా(Amith sha), కిషన్ రెడ్డి(Kishan Reddy), బండి సంజయ్ వంటి పలువురు నేతలకు ఆహ్వానాలు పంపగా.. ఈ ఆహ్వానంపై కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పందించారు. తాను తెలంగాణ ప్రభుత్వం నిర్వహించే ప్రజాపాలన దినోత్సవానికి రావడం లేదని సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఆ లేఖలో.. 'కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పరేడ్ గ్రౌండ్లో ఘనంగా జరుపుతోందని.. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం దానిని ప్రజాపాలన దినోత్సవంగా జరపడం ఏంటని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించే విమోచన దినోత్సవం నుండి ప్రజల దృష్టి మరల్చడానికే సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలన అని తెర మీదకి తెచ్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సెప్టెంబర్ 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని కోరుతున్నాం.." అని కిషన్ రెడ్డి తన లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed