కీలక ఘట్టం.. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్

by Satheesh |   ( Updated:2024-06-09 15:53:39.0  )
కీలక ఘట్టం.. కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బండి సంజయ్
X

దిశ, వెబ్‌డెస్క్: మోడీ 3.0 కేబినెట్‌లో చోటు దక్కించుకున్న తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ బండి సంజయ్.. ఫస్ట్ టైమ్ కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బండి సంజయ్ చేత ప్రమాణ స్వీకారం చేయించారు. బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, గడ్కరీ, నడ్డా ఇతరుల సమక్షంలో బండి హిందీలో కేంద్రమంత్రిగా ప్రమాణం చేశారు. మోడీ కేబినెట్ 3.0 కేబినెట్‌లో స్థానం సంపాదించుకున్న బండికి ఏ ఫోర్ట్ ఫోలియో దక్కుతుందోనని తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కాగా, కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి బండి సంజయ్ వరుసగా రెండు సార్లు ఎంపీగా గెలుపొంది.. మోడీ కేబినెట్ 3.0లో చోటు దక్కించుకున్నారు.

Advertisement

Next Story

Most Viewed