బూతులు, కోతలు కోయడం తప్ప చేతల్లో లేవు: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 9 |
Kishan Reddy lashes out at TRS Flexi Politics
X

దిశ, తెలంగాణ బ్యూరో: జర్నలిస్టులను ఒకరిద్దరిని జైల్లో వేస్తే బుద్ధొస్తుందన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఫైరయ్యారు. దీన్ని బట్టి రేవంత్ కు ఎంత అహంకారం ఉందో అర్థమవుతోందని ఆయన విమర్శలు ఎక్కుపెట్టారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప హామీలు అమలు చేతల్లో ఏమాత్రం లేవని మండిపడ్డారు. చేతలు కేవలం ట్యాక్స్ వసూలు చేయడంలోనే ఉన్నాయని ఆరోపణలు చేశారు. ప్రత్యేకంగా రీసెర్చ్ టీమ్ ను రేవంత్ పెట్టుకున్నారని విమర్శించారు. కొత్త తిట్లు, ఫేక్ వీడియోలను తయారు చేసి సర్క్యులేట్ చేయడంపై రీసర్చ్ టీం పెట్టుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్.. బీజేపీపై రిజర్వేషన్ అశంపై బురదచల్లాలని చూసిందని, అయితే ఈ ప్రచారం ఫెయిల్ అయిందని, బీజేపీపై విపక్షాలు చేస్తున్న వ్యతిరేక ప్రచారం తమకు సానుకూలంగా మారుతోందన్నారు.

ముఖ్యమంత్రిది బాధ్యతారాహిత్యమైన విమర్శ అని ఆయన పేర్కొన్నారు. బీజేపీకి మద్దతు పెరగడం చూసి కాంగ్రెస్ నేతల్లో కలవరం మొదలైందన్నారు. సీఎం ప్రసంగాల్లో అసహనం కనబడుతోంన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ వైఖరి ఒకటేనని, వీరికి ఏ తేడా లేదన్నారు. ముఖ్యమంత్రిలో అభద్రతాభావం, అసహనం పెరిగిపోయిందని పేర్కొన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేయడంలో రెండు పార్టీలు పోటీపడుతున్నాయన్నారు. అబద్ధాల ప్రచారంలో కల్వకుంట్ల కుటుంబానికి, రేవంత్ కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చని కిషన్ రెడ్డి ఎద్దేవాచేశారు. గెలవలేని సీట్లకు కేంద్రమంత్రి పదవి ఇప్పిస్తానని రేవంత్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్ని సెటైర్లు వేశారు.

రైతు భరోసాను కేంద్ర ఎన్నికల సంఘం నిలిపివేసిందని, ఎన్నికలు వస్తాయని ముందే తెలిసినా.. రైతుభరోసా ఎందుకివ్వలేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని డబ్బులు పంచినా.. తెలంగాణలో బీజేపీ రెండంకెల మార్కు దాటడం ఖాయమని కేంద్ర మంత్రి జోస్యం చెప్పారు. రాహుల్ గాంధీకి అత్యంత సన్నిహితుడు.. శామ్ పిట్రోడా జాత్యాంహకార వ్యాఖ్యలు చేయడంపై కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. భిన్నత్వంలో ఏకత్వానికి భారతదేశం ప్రతీక అని, దేశ ప్రజలపై కాంగ్రెస్ దురహంకార వైఖరికి అద్దం పడుతోందని ఫైరయ్యారు. గతంలో ప్రధానమంత్రిపైనా ‘నీచ్’ (తక్కువజాతి) అని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రజల ఆదరణ కోల్పోతుందని తెలిసినప్పుడల్లా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సాధారణమైపోయిందని కిషన్ రెడ్డి విమర్శలు చేశారు.

Read More...

నాకు పార్టీ ముఖ్యం పార్టీ లైన్ ముఖ్యం.. అదే నన్ను కాపాడుతుంది: సీఎం రేవంత్ రెడ్డి

Next Story