ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు ఆగింది..? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న

by Javid Pasha |   ( Updated:2023-10-19 11:34:25.0  )
ఓటుకు నోటు కేసు విచారణ ఎందుకు ఆగింది..? రాహుల్ గాంధీకి కిషన్ రెడ్డి సూటి ప్రశ్న
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎన్నికల ప్రచారాన్ని కాంగ్రెస్ ముమ్మరం చేసింది. రెండు రోజులుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రాష్ట్రంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. టీ కాంగ్రెస్ తలపెట్టిన బస్సు యాత్రలో పాల్గొని ప్రచారం చేస్తోన్నారు. ఈ సందర్బంగా పలుచోట్ల వివిధ వర్గాలకు చెందిన ప్రజలతో భేటీ అవుతుండగా.. బహిరంగ సభలు కూడా నిర్వహించనున్నారు. అలాగే ప్రచారంలో బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేననే విషయాన్ని ప్రజల్లోకి రాహుల్ తీసుకెళ్తున్నారు.

రాహుల్ ఆరోపణలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్ బీ టీమ్ అని, ఓటుకు నోటు కేసులో విచారణ ఎందుకు ఆగిందని ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిందన్నారు. అయినా కేసును ఎందుకు తొక్కి పెట్టారని, ఎవరు ఎవరితో కలిసిపోయారో అర్థమవుతుందని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్‌తో కలవాల్సిన అవసరం తమకు లేదని తెలిపారు. గతంలో కాంగ్రెస్ నేతలు చాలామంది బీఆర్ఎస్‌లో చేరారని, ఆ రెండు పార్టీలు ఒక్కటేనని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed