- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కేసీఆర్ లాగా రేవంత్‌కు కూడా అది అలవాటైపోయింది: కిషన్ రెడ్డి
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గ్రాడ్యుయేట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన మాట్లాడుతూ.. అసత్య ప్రచారాలు, అబద్ధపు హామీలు గుప్పించి కాంగ్రెస్ గద్దెను ఎక్కిందని కిషన్ రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని తెలిపారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే శక్తి సీఎం రేవంత్‌రెడ్డికి లేదని.. రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని తెలిపారు. కేసీఆర్ లాగా కాలయాపన చేయడం రేవంత్‌కు అలవాటుగా మారిందని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీలో ఉండే పరిస్థితి లేదని చెప్పారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ మొదలుకుని అన్ని పదవులకు బీజేపీ పోటీ చేస్తుందని, అందుకు స్థానిక నాయకులు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో బీఆర్‌ఎస్ అభ్యర్థి గెలిస్తే దానం, కడియం తరహాలో పార్టీ మారతాడని.. కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే రేవంత్‌రెడ్డి జపం చేస్తాడని అన్నారు. బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.