- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మహిళా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలి.. కిక్ బాక్సర్ ప్రతిభా తక్కడపల్లి
దిశ, వెబ్ డెస్క్: మహిళా క్రీడాకారులకు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని కిక్ బాక్సర్ తక్కడపల్లి ప్రతిభ కోరారు. ఏదైనా అవార్డు తీసుకొస్తే మంత్రి కూతురునైతే ఆకాశానికెత్తుతారని, కానీ తనలాంటి వాళ్లకు అంతగా ప్రాధాన్యం ఇవ్వరని ఆవేదన వ్యక్తం చేశారు. దిశ టీవీతో మాట్లాడిన ఆమె పలు విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారు. చిన్నప్పటి నుంచి తాను చదువుల్లో చురుకుగా ఉండేదానినని, కానీ క్రీడలంటే తనకు బాగా ఇష్టమని తెలిపారు. బాక్సింగ్ లాంటి క్రీడల్లో మహిళల పట్ల చిన్నచూపు ఉందని,కానీ మహిళలు ఎవరికీ తీసిపోరని అన్నారు.
ఇక మహిళా క్రీడాకారుల్లో కూడా అందరికీ ఒకే రకమైన గౌరవం, ప్రోత్సాహం లభించడం లేదని చెప్పారు. దేశం కోసం తాను ఎన్నో పతకాలు తెచ్చానని, కానీ రావాల్సినంత గుర్తింపు రాలేదని అన్నారు. మహిళా క్రీడాకారులకు ప్రభుత్వం మరింత ప్రోత్సాహం అందించాలని కోరారు. ఏ రంగంలో ఉన్న బెస్ట్ ఇవ్వడానికి ప్రయత్నించాలని యువతకు సూచించారు. ఇంకా ఎన్నో విషయాలు ఆమె దిశ టీవీతో పంచుకున్నారు. అవన్నీ తెలియాలంటే కింద ఇచ్చిన వీడియోను పూర్తిగా చూడండి.