వాహనాల తనిఖీలో రూ. 20 లక్షలు సీజ్

by Sridhar Babu |   ( Updated:2023-10-10 12:50:46.0  )
వాహనాల తనిఖీలో రూ. 20 లక్షలు సీజ్
X

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : సాధానరణ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ పోలీసులు అప్రమత్తం అయ్యారు. కొత్తగూడెం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం వాహనాల తనిఖీ చేపట్టారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తరువాతే వదిలేస్తున్నారు. ఈ తనిఖీలో ఎలాంటి దృవపత్రాలు లేకుండా తరలిస్తున్న రూ. 20 లక్షల నగదును సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా సీఐ ఎం. కరుణాకర్‌ మాట్లాడతూ స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున తప్పనిసరి

నిబంధనలు పాటించాలని సూచించారు. తనిఖీల్లో పట్టుబడిన డబ్బులకు సరైన ఆధారాలను చూపితే తిరిగి ఇచ్చేయడం జరుగుతుందన్నారు. సరైన దృవపత్రాలు లేకుండా డబ్బులు తరలిస్తే కేసు నమోదు చేసి వాహనాలను సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. వాహన తనిఖీలకు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళిని అందరూ పాటించాలని, వాహన తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. ఈ తనిఖీల్లో ఎస్సైలు బి. శ్రీనివాస్‌, జి.విజయ, హెచ్‌సీ ఎస్‌కె గని, సిబ్బంది వీరన్న, శంకర్‌ చారి, సంపత్‌ పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed