అనుమతులు లేని రూ.రెండు లక్షల విలువైన మందులు సీజ్

by Disha Web Desk 15 |
అనుమతులు లేని రూ.రెండు లక్షల విలువైన మందులు సీజ్
X

దిశ, కారేపల్లి : ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా ఇంట్లో నిల్వ ఉంచిన రెండు లక్షల విలువైన అల్లోపతి మందులను గురువారం ఖమ్మం,కొత్తగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్లు డి.దేవేందర్ రెడ్డి, సీహెచ్. సంపత్ కుమార్ లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని పోలంపల్లికి చెందిన ఈసాల రాజు తన ఇంట్లో 75 రకాల అధిక మోతాదు ప్రామాణ్యత కలిగిన అల్లోపతి మందులను ఇంట్లో నిల్వ చేశాడని పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి రెండు లక్షల విలువైన మందులను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. రాజు పై కేసు నమోదు చేసి సీజ్ చేసిన మందులను ఏజేఎఫ్ సీఎం కోర్టుకు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఈ దాడుల్లో ఖమ్మం అర్బన్ డ్రగ్ ఇన్స్పెక్టర్ సీహెచ్.అనిల్ కుమార్, ఏడీ జి. ప్రసాద్ పాల్గొన్నట్లు తెలిపారు.


Next Story