ముక్కోటి పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్

by Aamani |
ముక్కోటి పనులు వేగంగా పూర్తి చేయాలి : కలెక్టర్ జితేష్ వి.పాటిల్
X

దిశ,భద్రాచలం : ముక్కోటి పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. మంగళవారం భద్రాచలంలోని ముక్కోటి ఏర్పాట్లను ఆయన ఆర్ డి ఓ దామోదర్ రావు, ఈ ఓ రమాదేవి తో కలిసి పరిశీలించారు. ఈనెల 31 నుంచి వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా అధికారులు సమన్వయంతో పనిచేయాలని,పనులు వేగవంతం చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని కలెక్టర్ కోరారు. వచ్చే ఏడాది జనవరి 9న జరగబోయే తెప్పోత్సవం కార్యక్రమానికి సంబంధించి స్వామివారిని నదీ విహారం జరిపేందుకు ఉపయోగించే హంస వాహనాన్ని కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం ఉత్తర ద్వారం, గ్యాలరీల ఏర్పాట్లను పరిశీలించి, అధికారులకు పలు సూచనలు చేశారు. లక్షలాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రధమ చికిత్స కేంద్రాలతో పాటు ప్రతి భక్తునికి త్రాగునీరు అందేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. భద్రాద్రిలో జరిగే వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాల గురించి విస్తృత ప్రచారం నిర్వహించాలని, ఆన్లైన్ లో పొందుపరిచిన టిక్కెట్లను ఎప్పటికప్పుడు పరిశీలించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఉత్తర ద్వారంలో స్వామివారిని ప్రత్యక్షంగా దర్శించే వారి కోసం స్థానికంగా టికెట్ కౌంటర్లను పెంచి అందరికీ అందుబాటులో ఉంచాలని కలెక్టర్ కోరారు.

Advertisement

Next Story

Most Viewed