- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నికల వేళ దొంగ సన్నాసులొస్తున్నారు : ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఘాటు విమర్శ
దిశ, కారేపల్లి : ఎన్నికల వేళ వేషాలు వేసుకొని దొంగసన్నాసులు వస్తున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, వైరా ఎమ్మెల్యే రాములునాయక్ విమర్శించారు. శుక్రవారం కారేపల్లి మండలం పేరుపల్లిలో ఆత్మీయ సమ్మేళనం బీఆర్‌ఎస్ మండల అధ్యక్షులు పెద్దబోయిన ఉమాశంకర్ ఆధ్యక్షతన జరిగింది. ఈ సభలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు మాట్లాడుతూ రకరకాల వేషాలతో తామే సేవా పరులమంటూ వస్తున్నారన్నారు. ప్రజలకిచ్చిన మాటను నిలబెట్టుకోవటమే కాదు కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ దశ దిశ మార్చిన నేత సీఎం కేసీఆర్ అని కొనియాడారు. ప్రతి ఒక్కరి బాధకు చలించే మనస్తత్వం కేసీఆర్‌దని, అకాల వర్షాలకు పంటలను చూచి కంట తడి పెట్టారని, మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.10 వేలు పరిహారం ఇవ్వనున్నారన్నారు.
దేశానికి స్వాతంత్య్రం మహత్మాగాంధీ తీసుకొస్తే తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ స్వరాష్ట్ర ఆకాంక్షను తీర్చారన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని చూస్తేంటే ప్రధాని మోడీ మోకాలడ్డుతూ అడుగడుగునా ఆటంక పరుస్తున్నారని ఆరోపించారు. బీజేపీ మతం పేరిట మానవత్వం లేకుండా ప్రవరిస్తుందన్నారు. దేశ ప్రతిష్ట దిగాజారుస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ లేవలేని స్ధితిలో కొట్టుమిట్టాడుతుందని ఎద్దేవా చేశారు. రానున్న రోజుల్లో సంక్షేమ పథకాల లబ్ధి రెండింతలు కాబోతుందన్నారు. ప్రజల్లో ప్రభుత్వం, కేసీఆర్‌పై వ్యతిరేకత లేదన్నారు. కార్యకర్తలు, నాయకులు ప్రజలతో కలిసి పని చేయాలని సూచించారు. భయం వద్దు అర్హులైన పోడుదారులకు హక్కులు వచ్చాయని, వాటిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేతులమీదిగా మహబూబాబాద్ లేదా ఇల్లందులో జరిగే సభలలో పంపిణీ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ బన్సీలాల్, ఎంపీపీ మాలోత్ శకుంతల, వైస్‌ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సోసైటీ అధ్యక్షులు దుగ్గినేని శ్రీనినాసరావు, ఉపాధ్యక్షులు దారావత్ మంగీలాల్, సంత ఆలయ చైర్మన్ అడ్డగోడ ఐలయ్య, పుట్టా నాగేశ్వరరావు, సర్పంచ్‌లు అజ్మీర నాగేశ్వరరావు, పిల్లలమర్రి స్వర్ణ, తేజావత్ మంగమ్మ, ఎట్టి రజనిరామారావు, బానోత్ పద్మామోహన్, గుగులోత్ సక్రు, ఎంపీటీసీలు భాగం రూపానాగేశ్వరారవు, దారావత్ మంగమ్మ, న్యాయవాది నర్సింగ్ శ్రీనివాసరావు, నాయకులు ముత్యాల సత్యనారాయణ, అజ్మీర వీరన్న, తోటకూరి రాంబాబు, బత్తుల శ్రీనివాసరావు, అడపా పుల్లారావు, సోసైటీ, ఏఎంసీ డైరక్టర్లు మర్సకట్ల రోషయ్య, వాంకుడోత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.