వారికి జడ్డీ నే అంబులెన్స్ ...

by Kalyani |
వారికి జడ్డీ నే అంబులెన్స్ ...
X

దిశ, భద్రాచలం : గిరిజన సంక్షేమం కోసం కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తున్నా... ఇంకా రోడ్లు, రవాణా సౌకర్యం లేని గ్రామాలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలగక మానదు. కొన్ని గ్రామాలలో ప్రజలకు ప్రాణం మీదకు వస్తే... జడ్డీ లే వారికి అంబులెన్సు. ఇటువంటి సంఘటనలు తరచూ భద్రాద్రి ఏజెన్సీలో చోటుచేసుకుంటున్నాయి. సోమవారం జరిగిన ఒక సంఘటన గిరిజనుల దుస్థితికి అద్దం పడుతుంది.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం బట్టిగూడెం గ్రామానికి చెందిన రవ్వ దేవి అనే గిరిజన మహిళకు పురిటి నొప్పులు వస్తుండడంతో సమీపంలో ఉన్న ఆశా వర్కర్ గమనించి ఆ గ్రామస్తులతో కలిసి సోమవారం ఉదయం బట్టి గూడెం నుంచి కాలినడకన సుమారు 10 కిలోమీటర్ల దూరం నుంచి తిప్పాపురం వరకు గర్భిణీ స్త్రీని జడ్డిలతో మోసుకొచ్చారు. 108 వాహనం ఫోన్ చేయగా 108 వాహనం అందుబాటులో లేకపోవడంతో ఆటోలో గర్భిణీ మహిళను సత్యనారాయణపురం కు తరలించారు. అక్కడ నుంచి భద్రాచలం హాస్పిటల్ కి తరలించారు. భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.

Advertisement

Next Story

Most Viewed