- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Road Damage : గుంతల మయం.. గుండెల్లో భయం
దిశ,ఏన్కూర్ : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండలంలోని పలు గ్రామాల రోడ్లన్నీ బురద మయంగా మారి అత్యంత అద్వానంగా మారాయి. ఏన్కూరు మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ దగ్గర బురదమయంగా మారింది. మండల కేంద్రంలోని ప్రధాన సెంటర్ వద్ద రోడ్డు దెబ్బతిన్నది. మండల పరిధిలోని పలు గ్రామాలలో రోడ్లన్నీ బురద మయంగా మారిన వైనం. ఓ మోస్తారు వర్షానికి కూడా పలు గ్రామాల్లో రోడ్లన్నీ బురదమయం గా మారిన పరిస్థితి. ఏన్కూర్ ప్రధాన సెంటర్ వద్ద రోడ్డు మీద మోటార్ వాహనాలు నడపాలంటే ఇబ్బందిగా ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు గుంతలు మయంగా మారాయి. వాన వస్తే చిత్తడే. దీనికి కారణం పంచాయతీ పాలన పడక వేయడం వలన ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆరోపిస్తున్నారు.. టీ.యల్. పేట రోడ్డుపై మీటర్ల లోతు గుంతలు ఏర్పడ్డాయి.
అయినా పట్టించుకునే నాధుడు లేరని పలువురు ఆవేదన చెందుతున్నారు. బురద రాఘవ పురం మూల మలుపులో రోడ్డు కోతకు గురైంది అయితే రాత్రి వేళలో మోటర్ వాహనంపై ప్రయాణం చేయాలంటే ప్రాణం అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిందే. . బురద రాఘవాపురం రోడ్డు కోతకు గురైన విషయం గత వారం రోజుల క్రితం దిశ వెలుగులోకి తీసుకొచ్చింది. అధికారుల్లో అయినా చలనం లేదు. టీ.యల్ పేట వెళ్లి దారిలో అడుక్కో గుoతలు ఏర్పడ్డాయి.చిన్న గుంతలు కాస్త పెద్ద గుంతలుగా మారాయి.దీంతో ప్రజలు నరకయాతన పడుతున్నారు. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు గుంటల వల్ల రోడ్లపై ప్రయాణం చేయడం అత్యంత ప్రమాదకరంగా మారింది .దెబ్బతిన్న రోడ్లన్నీ మరమ్మతులు చేపట్టి వాహనదారుల, ప్రజలు ప్రాణాలు కాపాడాలని పలువురు కోరుతున్నారు.