- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
state budget : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడి మాత్రమే..
దిశ, మధిర : గత పది సంవత్సరాల్లో టీఆర్ఎస్ పార్టీ ఆడిన అంకెల గారడి ఆటను ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆడుతుందన్నారు. భారతీయ జనతా పార్టీ మధిర అసెంబ్లీ కన్వీనర్ ఏలూరి నాగేశ్వరరావు అన్నారు. మేనిఫెస్టోలో పెట్టిన 6 గ్యారంటీలు, తెలంగాణ బడ్జెట్, గాడిద గుడ్డు అని నిన్న ప్రవేశపెట్టిన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. స్థానిక బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక మంత్రి చదివింది.. ఆర్థిక బడ్జెట్ లో లేదంటే, అప్పుల పత్రమా బడ్జెట్ అనేది క్లారిటీ లేదు, ఆరు గ్యారంటీల అమలుకు తగిన నిధుల ఊసు లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులకు ఆదాయం ఎక్కడి నుంచి వస్తుందో లెక్కాపత్రం లేదు, రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు చేసే పరిస్థితి లేదన్నారు. రైతులకు జరిగిన నష్టాన్ని పూడ్చి రుణమాఫీ డిఫాల్టర్ల జాబితా నుంచి తొలగిస్తారో లేదో స్పష్టత లేదన్నారు. రూ.లక్షన్నర కోట్లతో నిర్మిస్తామన్న మూసీరివర్ ఫ్రంట్ కు బడ్జెట్ లో పైసా కూడా కేటాయించలేదన్నారు.
రైతు భరోసా, రూ.500 బోనస్, పంట నష్ట పరిహారం నిధులను ఈ ఏడాది చెల్లిస్తారా ? లేదో చెప్పలేదన్నారు. 90 లక్షల తెల్లరేషన్ కార్డులుంటే, 39 లక్షల మందికే గ్యాస్ సబ్సిడీ ఇచ్చి గొప్పలు చెబుతున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి, 50 లక్షల మంది అర్హులకు రూ.500 సబ్సిడీని ఎగ్గొట్టి మహిళల్లో వెలుగులు నింపామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. 12 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇచ్చి 31 వేలకు పైగా ఉద్యోగాలు భర్తీ చేశామంటారు. మొత్తంగా తెలంగాణ బడ్జెట్ లో రాష్ట్ర ప్రజలకు మిగిలింది ‘గాడిద గుడ్డే తెలంగాణ ప్రజానీకం మొత్తం గమనిస్తుందని కేసీఆర్ కు పట్టిన గతే ఈ సర్కార్ కూడా పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యదర్శి, చిలువేరు సాంబశివరావు జిల్లా అధికార ప్రతినిధి, రామిశెట్టి నాగేశ్వరావు పట్టణ అధ్యక్షులు, పాపట్ల రమేష్ పాల్గొన్నారు.