- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంజీవని అంబులెన్స్‌లకు సుస్తి..!
దిశ, కొత్తగూడెం: రాష్ట్రానికి వెలుగులను అందించే సింగరేణి సంస్థ కార్మికుల సంక్షేమం పట్ల నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోంది. ఓ వైపు సింగరేణి సంస్థ 'ఒకే కుటుంబం - ఒకే లక్ష్యం - ఒక గమ్యం' అంటూ నినాదాలను ప్రచారం చేసుకున్నప్పటికీ అవి ప్రకటనలకే పరిమితం అవుతున్నాయి. అధికారులకు ఇచ్చే వాహనాలను ప్రతి మూడేళ్లకు ఒకసారి మార్చి టెండర్లు పిలిచి నూతన వాహనాలను ఏర్పాటు చేస్తారు, కానీ కార్మికులకు ప్రమాదాలు తలెత్తినప్పుడు, ఆరోగ్యపరంగా అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు వారిని హైదరాబాద్ లాంటి సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లే సంజీవని మొబైల్ ఐసీయూలను 12 ఏండ్లు దాటినా మార్చడం లేదు. అవే పాత వాహనాలతో నెట్టుకొస్తున్నారు.
వర్క్‌షాప్‌నకు పరిమితం..
సింగరేణి సంస్థ సుమారు 12 ఏళ్ల క్రితం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సంజీవని మొబైల్ ఐసీయూ వాహనాలు మెకానిక్ షెడ్లకు పరిమితం అవుతున్నాయి. కొత్తగూడెం సింగరేణి మెయిన్ హాస్పిటల్‌లో రెండు సింగరేణి సంజీవని అంబులెన్సులు, నాలుగు ప్రైవేట్ అంబులెన్సులు, ఓ మార్చురీ వాహనం ఉన్నాయి. ఇందులో రెండు సంజీవని అంబులెన్స్ నిత్యం మరమ్మతులకు గురవుతున్నాయి. గత వారం రోజులుగా రెండు వాహనాలను రామవరంలోని ఆటో వర్క్‌షాప్‌లో ఉంచి రిపేరు చేస్తున్నారు. కార్మికులకు ఏమైనా ప్రమాదం సంభవించినా, అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం కార్మికుల్ని హైదరాబాద్‌కు తరలించాలన్నా ఈ వాహనాలే ఉపయోగించేవారు. కానీ యాజమాన్యం నిర్లక్ష్యం తో సంజీవని వాహనాలు కార్మికులకు అందుబాటులో ఉండటం లేదు. కాలం చెల్లిన వాహనాలవడంతో నిత్యం రిపేర్ల కోసం ఆటో వర్క్‌షాప్‌నకు సంజీవని వాహనాలను తరలిస్తున్నారు.
కార్మికుల సంక్షేమంపై సింగరేణి సంస్థ వివక్ష..
సింగరేణిలోని కార్మికుల సంక్షేమంపై సంస్థ వివక్ష ప్రదర్శిస్తోందని పలువురు కార్మికులు చర్చించుకుంటున్నారు. సింగరేణి సంస్థ యాజమాన్యం, కార్మికుల సంక్షేమం, ఆరోగ్య భద్రతపై మాత్రం వివక్ష ప్రదర్శిస్తున్నారు, సంజీవిని అంబులెన్స్‌లో నిర్వహణలో అత్యంత నిర్లక్ష్యం వహిస్తూ.. కార్మికుల ఆరోగ్య భద్రతపై అలసత్వం వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు గనుల్లో ఏదైనా ప్రమాదం జరిగితే అత్యాధునిక వసతులున్న అంబులెన్సులు అందుబాటులో లేకపోవడం కార్మికుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. వేలకోట్ల లాభాల్లో ఉన్న సింగరేణి సంస్థ కార్మికుల ఆరోగ్య భద్రతపై నిర్లక్ష్యం వహిస్తుందని కార్మికులు చర్చించుకుంటున్నారు. మెరుగైన చికిత్స కోసం కార్మికులను హైదరాబాద్ ఆస్పత్రులకు తరలిస్తుండగా పలుమార్లు సంజీవిని అంబులెన్స్‌లు రిపేర్లతో గంటల తరబడి నిలిచిపోయినట్లు సమాచారం. పేషెంట్‌ను సరైన సమయంలో ఆస్పత్రికి చేర్చలేక డ్రైవర్లు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. పలు సందర్భాల్లో దారి మధ్యలో అంబులెన్స్ ఆగిపోవడంతో కార్మికుని కుటుంబ సభ్యులు, అంబులెన్స్ డ్రైవర్లకు వాగ్వివాదం సైతం జరిగినట్లు తెలుస్తోంది.
అరకొర ఏర్పాట్లతోనే..
సంజీవిని అంబులెన్స్ వాహనాలను 12 ఏండ్ల క్రితం అత్యాధునిక సౌకర్యాలతో ప్రారంభించారు. ఇల్లందు, మణుగూరు, సత్తుపల్లి ఏరియాల నుంచి కార్మికులకు ఎటువంటి ఎమర్జెన్సీ ఆరోగ్య సమస్య ఏర్పడినప్పటికీ కొత్తగూడెంలోని సింగరేణి మెయిన్ హాస్పిటల్‌కు వచ్చి అడ్మిట్ అవుతారు. సింగరేణి సంస్థలో పనిచేసే కార్మికుల సౌకర్యార్థం వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. వాహనాలను ప్రారంభించి, నిర్వహణ గాలికి వదిలేశారు. సింగరేణి సంస్థ అధికారులు. గతంలో సంజీవిని అంబులెన్స్ వాహనంలో ఉన్న పరికరాల్లో ఏ ఒక్క పరికరం సైతం ఇప్పుడు అందుబాటులో లేవు. మినీ ఐసీయూను పోలి ఉండే వాహనంలో వెంటిలేటర్, ఆక్సిజన్‌తో సహా పలు రకాల ఏర్పాట్లు ఉండేవి. అధికారుల నిర్లక్ష్యంతో ఆ పరికరాలన్నీ మూలనపడ్డాయి. పరికరాల సంగతి అటుంచితే, సంజీవని అంబులెన్స్ వాహనాలు ఏమాత్రం కండిషన్‌లో లేవని సమాచారం. బయల్దేరిన దగ్గర నుంచి గమ్యస్థానం చేరుకునే వరకు వాహనం ఎక్కడ ఆగిపోతుందో అని ఆందోళన చెందుతున్నారు డ్రైవర్లు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పాతవాహనాల స్థానంలో నూతన అంబులెన్స్ వాహనాలను ఏర్పాటు చేయాలని పలు కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
త్వరలోనే నూతన వాహనాలు : శ్రీనివాస్ , సింగరేణి ప్రధాన ఆసుపత్రి వెల్ఫేర్ ఆఫీసర్.
నూతన వాహనాలను ఏర్పాటు చేసే ప్రక్రియ మొదలుపెట్టాం. త్వరలో సంజీవని అంబులెన్సుల కోసం టెండర్ల ప్రక్రియ మొదలు కాబోతుంది.