- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మధ్యాహ్నం భోజనం లేని రోజులు గడిపా : ఎమ్మెల్యే రాములు నాయక్
దిశ, వైరా : విద్యార్థి దశలో తాను ఎంతో కష్టపడి చదువుకోవటం వల్లనే నేడు ఈ స్థాయిలో ఉన్నానని, మధ్యాహ్నం భోజనం లేని రోజులు గడిపానని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరా మండల పరిషత్ కార్యాలయంలో వైరా మండల ఉపాధ్యాయులు, కవులు, కళాకారులకు శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదిన సందర్భంగా మంగళవారం కవి సమ్మేళనం, సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ హాజరై ప్రసంగించారు. తాను చదువుకునే రోజుల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు లేవని చెప్పారు. కిలోమీటర్ల కొద్ది నడిచి వెళ్లి పాఠశాలలో చదువుకున్నానని పేర్కొన్నారు. ఆ రోజుల్లో రవాణా సౌకర్యాలు, ఆర్థిక వసతులు ఏమీ లేవని వివరించారు. పాఠశాలకు వెళ్లిన తర్వాత మధ్యాహ్నం భోజనం చేయకుండానే విద్యను అభ్యసించిన సందర్భాలు అనేకం ఉన్నాయన్నారు. ఆనాడు తమకు విద్యను బోధించిన గురువుల సహాయ సహకారాలతో ఎంతో కష్టపడి చదువుకున్నామని వివరించారు.
కష్టపడి చదువుకోవటం వల్లనే పోలీస్ శాఖలో ఉద్యోగం సాధించి ఎస్ఐ స్థాయి వరకు పనిచేశానని చెప్పారు. గురువులు కృషి వల్లనే తమ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఉన్నత స్థానాలకు ఎదిగి ప్రభుత్వ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్నారని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో అనేక మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పించిందన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులు భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదిగి ఉద్యోగాల్లో స్థిరపడి ఈ దేశ భవిష్యత్తుకి ఉపయోగపడాలని సూచించారు. ఈ సందర్భంగా గురువులలో దాగి ఉన్న కవులు, రచయితలు, గాయకులను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రత్యేకంగా సన్మానించారు. అదేవిధంగా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎమ్మెల్యే రాములు నాయక్ ను ఘనంగా సన్మానించారు. రాబోయే రోజులలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయనీ ఉపాధ్యాయులకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో వైరా మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లపాటి సీతారాములు, మార్కెట్ కమిటీ చైర్మన్ బీడేకే రత్నం, ఎంపీపీ వేల్పులు పావని, జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.