నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక..: డిప్యూటీ సీఎం భట్టి

by Aamani |
నిరంతర విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రణాళిక..:  డిప్యూటీ సీఎం భట్టి
X

దిశ, ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో నిరంతరం విద్యుత్ సరఫరాకు ప్రత్యేక ప్రణాళికలు కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతుందని డిప్యూటీ సీఎం, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. మంగళవారం వెంకటాయపాలెం లోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.... తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సరఫరాను పునర్దించేందుకు సబ్ స్టేషన్లు, విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఇప్పటికే విద్యుత్ శాఖ అధికారులు పొలం బాట కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు అనేక సమస్యలను పరిష్కరించడం జరిగిందన్నారు. వ్యవసాయ పొలాల్లో వంగిన స్తంభాలు, వంగిన విద్యుత్ తీగలను సరి చేసి రైతులకు నిరంతరం విద్యుత్ సరఫరాను అందించడం జరుగుతుందని ఆయన తెలిపారు.రాబోయే రోజుల్లో మారుతున్న సమాజానికి అనుగుణంగా విద్యుత్ వ్యవస్థలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ఆలోచన దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు.

విద్యుత్ వ్యవస్థలో లైన్ మెన్ సంస్థకు మెన్ రోల్ కాబట్టి విద్యుత్ శాఖ అధికారులు లైన్ మెన్ పై దృష్టి పెట్టాలన్నారు. లైన్ మేన్ మంచిగా పని చేస్తేనే ప్రభుత్వానికి కూడా మంచి పేరు వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా ఎన్పీడీసీఎల్ లో ప్రమోషన్ లేకుండా ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరికీ ప్రమోషన్ కల్పించామని తెలిపారు. విద్య శాఖలను ఖాళీలను గుర్తించి వెంటనే భర్తీలను పూర్తి చేస్తామన్నారు. విద్యుత్ సమస్యలు ఉంటే 1912 సంప్రదించి తమ సమస్యలను వివరించాలన్నారు.ఈ టోల్ ఫ్రీ నెంబర్ ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed