తండ్రిని చంపిన కుమారుడు.. రూ.100 అడిగాడన్న కోపంతో..

by Javid Pasha |   ( Updated:2022-06-10 14:53:32.0  )
తండ్రిని చంపిన కుమారుడు.. రూ.100 అడిగాడన్న కోపంతో..
X

దిశ, కరకగూడెం: తండ్రిని కన్నకొడుకే బండరాయితో కొట్టి హతమార్చిన ఘటన గ్రామంలో కలకలం రేపింది. మండల పరిధిలోని చోప్పాల గ్రామ పంచాయతీలో గల నర్సాపురం గ్రామంలో గత 15 సంవత్సరాలగా స్థిర నివాసం ఉంటున్న వలస ఆదివాసి కుంజ లక్ష్మయ్య (54). ఆయనను అతడి చిన్న కుమారుడే హత్య చేశాడు. కుటుంబ సభ్యులు స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. లక్మయ్యకు నిత్యం మద్యంసేవించే అలవాటు ఉంది. ఎప్పటిలానే మద్యం తాగేందుకు తన కుమారుడిని రూ.100 రూపాయలు అడిగాడు. దాంతో తండ్రి కొడుకుల మధ్య చిన్న ఘర్షణ జరిగింది. గొడవత తీవ్ర ఆగ్రహానికి గురైన కుమారుడు సోమడు 14 సంవత్సరాలు తన తండ్రిపై బండరాయితో దాడికి చేశాడు. ఇందులో రాయి లక్ష్మయ్య ఎడమ చెవి భాగంలో బలంగా తగిలింది. దాంతో లక్ష్మయ్య అక్కడికక్కడే మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. మృతుని పెద్ద కుమారుడు కుంజ ఉంగయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం లక్ష్మయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రికి పంపినట్లు కరకగూడెం ఏఎస్ఐ పాపయ్య, రైటర్ దుర్గరావు, తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed