సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు.. : నవ్‌జ్యోత్ సిద్ధూ

by Sathputhe Rajesh |
సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదు.. : నవ్‌జ్యోత్ సిద్ధూ
X

దిశ, స్పోర్ట్స్ : ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి మహమ్మద్ సిరాజ్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని భారత మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ ప్రశ్నించాడు. ఈ మేరకు ఆదివారం స్పోర్ట్స్‌తక్ ఛానెల్‌తో సిద్ధూ మాట్లాడాడు. ‘చాంపియన్స్ ట్రోఫీ స్క్వాడ్‌ను పరిశీలిస్తే సెలక్టర్లు ఆల్ రౌండర్లకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అర్థం అవుతోంది. స్క్వాడ్‌లో హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, సుందర్‌లు ఉన్నారు. వీరు జట్టు క్షిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆదుకుంటారనడంలో సందేహం లేదు. కానీ నేను జట్టును ఎంపిక చేస్తే ముగ్గురు స్పిన్నర్లు, నలుగురు సీమర్లకు ఛాన్స్ ఇస్తాను. ఖచ్చితంగా సిరాజ్‌ను జట్టులోకి తీసుకుంటాను. గతంలో వెస్టిండీస్ సిరీస్‌కు నలుగురు స్పిన్నర్లను తీసుకెళ్లారు. కానీ చహాల్‌ను ఆడించలేదు. షార్జా, దుబాయ్ స్పిచ్‌లపై స్పిన్నర్లు అంతగా ప్రభావం చూపరు. అయినా జట్టులో సమతూకం పాటించారనే భావిస్తున్నా..’ అని సిద్ధూ అన్నాడు. భారత మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా సైతం సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు.

Next Story

Most Viewed