BRS: రేవంత్‌ను నమ్మి ఏ సంస్థ ముందుకొస్తుంది.. కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు

by Ramesh Goud |
BRS: రేవంత్‌ను నమ్మి ఏ సంస్థ ముందుకొస్తుంది.. కేపీ వివేకానంద సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషంట్ తో పోల్చారని, పెట్టుబడులు పెట్టేందుకు ఏ సంస్థ ముందుకు వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్(BRS MLA Kp Vivekananda Goud) అన్నారు. తెలంగాణ భవన్(Telangana Bhavan) లో మీడియాతో మాట్లాడిన ఆయన.. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనలపై(Revanth Reddy Foreign Tour) విమర్శలు చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మి ఏ సంస్థ పెట్టుబడులు(Investments) పెడుతుందని అన్నారు. రేవంత్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలు రాష్ట్రాన్ని ఆగమాగం చేశాయని, ఇక పెట్టుబడులు రమ్మంటే ఎలా వస్తాయని చెప్పారు.

కేసీఆర్(KCR) రాష్ట్రంలో 24 గంటల విద్యుత్తు, పుష్కలంగా నీటి సరఫరా, శాంతిభద్రతలు, పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయగా, రేవంత్ ఆ వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడని ఆరోపించారు. అసెంబ్లీ వేదికగా రాష్ట్రాన్ని క్యాన్సర్ పేషంట్‌(Cancer Patient)తో పోల్చిన రేవంత్ వ్యాఖ్యలను ప్రజలు మర్చిపోలేరని తెలిపారు. ఒక చర్చా వేదికలో ప్రభుత్వ నిర్ణయాల వల్ల సంస్థకు నష్టం కలిగిందని ఆ సంస్థ ప్రతినిధి అన్నాడని విలేఖరి అనగా, ఆ సంస్థ ప్రతినిధిని అరెస్టు చేయమని ఆదేశించానని చెప్పిన రేవంత్ వంటి వ్యక్తిని ఎవరు నమ్ముతారని ప్రశ్నించారు. అంతేగాక ఏకకాలంలో రైతులకు 2 లక్షల రుణమాఫీ, 100 రోజుల్లో 6 గ్యారంటీల అమలు వంటి మోసాలు ఎలా జరిగాయో, పెట్టుబడుల వాగ్దానాలు కూడా అంతేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎద్దేవా చేశారు.

Next Story

Most Viewed