- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
విజయ్ దేవరకొండతో రిలేషన్‌షిప్‌ను పోస్ట్‌తో కన్ఫార్మ్ చేసిన రష్మిక.. బంధం కోసం ఆ రూల్ పాటించాల్సిందేనంటూ

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న(Rashmika Mandanna) ఇటీవల పుష్ప-2, ఛావా వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది. ఇక ఆ తర్వాత సల్మాన్ నటించిన ‘సికందర్’ చిత్రంలో హీరోయిన్‌గా చేసింది. అయితే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ప్రస్తుతం రష్మిక కుబేర(Kubera), ది గర్ల్‌ఫ్రెండ్(The Girlfriend), థామా వంటి సినిమాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ చిత్రాలు ఈ ఏడాదిలో విడుదల చేయాలని మూవీ మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రష్మిక పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. ఈ అమ్మడు గత కొద్ది రోజుల నుంచి రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda)తో ప్రేమలో ఉందని వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.
నిత్యం వీరిద్దరు పలు వెకేషన్స్‌కు కూడా వెళ్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఎన్నో సార్లు ఈ లవ్ బర్డ్స్ ఆధారాలతో అడ్డంగా దొరికిపోయారు. కానీ వీరి రిలేషన్‌షిప్‌పై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో వీరి ప్రేమకు సంబంధించిన ఏదో ఇక వార్త నెట్టింట వైరల్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలో.. తాజాగా, రష్మిక మందన్న తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పెట్టిన ఓ పోస్ట్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. అసలు అందులో ఏముందంటే.. ‘‘అసలు రిలేషన్‌షిప్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే పాటించాల్సిన రూల్ ఏంటంటే.. ఎప్పుడూ ఏ క్షణం అయినా సరే ఒంటరిగా బాధపడే రోజు రాకుండా చూసుకోవాలి.
కష్టసుఖాల్లో ఇద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటే చాలు. ఎట్టి పరిస్థితుల్లోనూ చేయి విడవద్దు అనే రూల్ పెట్టుకుంటే చాలు. అవును దానిని నేను కూడా అంగీకరిస్తున్నాను. అది కూడా వాస్తవమే అని నమ్ముతున్నా’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం రష్మిక పోస్ట్ వైరల్ అవుతుండటంతో అది చూసిన వారు విజయ్‌తో రిలేషన్‌ను ఈ పోస్ట్ ద్వారా కన్ఫార్మ్ చేసిందని అంతా చర్చించుకుంటున్నారు. కానీ రష్మిక అభిమానులు మాత్రం అందులో నిజం లేదని వాటిని కొట్టిపారేస్తున్నారు.