- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ACB : ఏసీబీకి చిక్కిన ఎస్సై..
దిశ, పాల్వంచ : లంచం తీసుకుంటూ పాల్వంచ పట్టణ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బి.రాము గురువారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ పట్టణ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న బాణాల రాము రూ.20,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నామన్నారు. పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ 286/24 కింద సిరప్ శ్రావణి అనే మహిళ కోర్టు ద్వారా కంప్లైంట్ ఇచ్చారు.
కంప్లైంట్ ని రిజిస్టర్ చేసి ఆ కేసు విషయంలో సంబంధించి ఐదుగురు నిందితులు శ్రావణిని బెదిరింపులకు గురి చేయడంతో వారిని అరెస్టు చేయాలంటే రూ.20,000 డిమాండ్ చేయడంతో శ్రావణి తన అడ్వకేట్ లక్ష్మారెడ్డిని సంప్రదించిందని తెలిపారు. అడ్వకేట్ లక్ష్మారెడ్డి ఏసీబీ అధికారులకు తెలియజేయడంతో స్పందించి ఎస్సై రాముని ట్రాప్ చేసి అడ్వకేట్ లక్ష్మారెడ్డి ఇరవై వేల రూపాయలు ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని కలర్ టెస్ట్ చేశామని తెలిపారు. ఏ ప్రభుత్వ అధికారికి లంచం ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎవరైనా అధికారులు లంచం అడిగినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కి ఫిర్యాదు చేయవలసిందిగా ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీసీ సిబ్బంది శేఖర్ మహేష్ వెంకట్రావు రామారావు తదితరులు పాల్గొన్నారు.