మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆరెంపుల గణేష్​ లడ్డూ..

by Kalyani |
మత సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ఆరెంపుల గణేష్​ లడ్డూ..
X

దిశ, ఖమ్మం రూరల్​: ఖమ్మం రూరల్ మండలంలోని ఆరెంపుల గ్రామంలో గణేష్​ లడ్డూ మత సామరస్యానికి ప్రతీకగా నిలిచింది. గ్రామంలో వినాయక నవరాత్రి ముగింపు సందర్భంగా వినాయక మండపం వద్ద లడ్డూ వేలంపాటను సోమవారం నిర్వహించారు. ఆరెంపుల గ్రామానికి చెందిన ముస్లిం దంపతులు దాదాసాహెబ్, షమీ రూ. 23,500 లకు వేలంపాటలో లడ్డూ దక్కించుకొని మత సామరస్యాన్ని చాటారు. హిందూ, ముస్లిం అనే భేదాలు లేవని చాటేందుకే ఈ వేలం పాట పాడినట్లు దాదాసాహెబ్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు బొడ్డు. జితెందర్, నూకల. యాకయ్య, బొడ్డు. వెంకటేశ్వర్లు, మట్టా. సంజీవరెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed