- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దృష్టిలోపం ఉన్న కళ్లకు కంటి వెలుగుతో పునర్జన్మ : ఎమ్మెల్యే రాములునాయక్
దిశ, వైరా : ఆరోగ్యమే మహాభాగ్యం అని, దృష్టిలోపం ఉన్న కళ్లకు కంటి వెలుగుతో పునర్జన్మ లభిస్తుందని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ అన్నారు. వైరాలో అంతర్భాగంగా ఉన్న బ్రాహ్మణపల్లి లో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కేంద్రాన్ని సోమవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ప్రజలకు అందుతున్న వైద్య సదుపాయాలని పరిశీలించారు. అనంతరం మండల వైద్యాధికారిణి ఉదయలక్ష్మి ఏర్పాటు చేసిన మహిళ వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మహిళా వైద్యులు కరోనా సమయములో ప్రాణాన్ని సైతం లెక్కచేయకుండా, ఎలాంటి భయాందోళనలు చెందకుండా ఎంతోమందికి సేవ చేశారని కొనియాడారు.
ప్రత్యేకించి ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలేనని కొనియాడారు. కంటి చూపు సరిగా ఉన్నప్పుడే మన జీవితంలో వెలుగులు కొసాగుతాయని చెప్పారు. దృష్టిలోపం ఉన్నవారికి చూపులో పునర్జన్మనిచ్చేందుకే సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. నేను కూడా కంటి వెలుగు కళ్లజోడునే వాడుతున్నానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ స్పందన , సీహెచ్ఓ ఉదయలక్ష్మి, ఏఎన్ఎం ,ఆశ కార్యకర్తలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, మార్కెట్ చైర్మన్ బీడీ కే రత్నం, పట్టణ మహిళా అధ్యక్షురాలు బానోతు సక్కుబాయి, మండల మహిళా అధ్యక్షురాలు సౌజన్య, కో ఆప్షన్ సభ్యులు షేక్ బీభ సాహెబ్, కౌన్సిలర్ దారిల్లి కోటయ్య, సురేష్ పాల్గొన్నారు.