private blood testing centers : ప్రైవేటు రక్తపరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ...

by Sumithra |
private blood testing centers : ప్రైవేటు రక్తపరీక్ష కేంద్రాల ఆకస్మిక తనిఖీ...
X

దిశ, కల్లూరు : కల్లూరులోని ప్రైవేటు రక్తపరీక్ష కేంద్రాలను జిల్లా ఉపవైద్య ఆరోగ్య అధికారి (కల్లూరు) డాక్టర్ సీతారాం శుక్రవారం నాడు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు తప్పుడు నివేదికలు ఇచ్చి వారిని భయభ్రాంతులకు గురిచేయవద్దని, డెంగీ అనుమానిత కేసులు ఉన్నయెడల ప్రభుత్వ ఆసుపత్రికి పంపించాలని, ప్రభుత్వం నిర్ణయించిన ధరలను మాత్రమే ప్రజల వద్ద వసూలు చేయాలని, అన్ని రక్త పరీక్షా కేంద్రాలు వైద్య ఆరోగ్యశాఖ అనుమతితో మాత్రమే నిర్వహించాలని, అర్హత కలిగిన టెక్నిషియన్ మాత్రమే పరీక్షలు చేయాలని, గడువు దాటిన రక్తపరీక్ష కేంద్రాలు క్రమం తప్పకుండా రెన్యువల్ చేయించుకోవాలని, ఇట్టి నిబంధనలు పాటించని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా, క్రిమినల్ కేసులు నమోదు చేయబడతాయని వారిని హెచ్చరించారు.

రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న రక్తపరీక్ష కేంద్రాలకు షోకాజ్ నోటీసులు ఇచ్చారు. న్యూ ప్రతాప్ ల్యాబ్ నందు బయో కెమిస్ట్ లేకుండానే అనలైజర్ నిర్వహించడం పై ఆగ్రహం వ్యక్తం చేసి, షో కాజ్ నోటీస్ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కల్లూరు వైద్యాధికారి డాక్టర్. నవ్యకాంత్, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రేవతి, సూపర్వైజర్ రామారావు, చార్లెస్ పాల్గొన్నారు.



Next Story