ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి

by Kalyani |   ( Updated:2024-10-14 15:17:12.0  )
ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి
X

దిశ, ఖమ్మం : ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ ప్రజల దరఖాస్తులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులు, బయో మెట్రిక్ అటెండెన్స్, వివిధ అంశాలపై అదనపు కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో అధికంగా పెండింగ్ ఉన్న ప్రజావాణి దరఖాస్తులను అదనపు కలెక్టర్ శాఖల వారీగా సమీక్షించి దరఖాస్తులను త్వరగా పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. మండలంలో పెండింగ్ ప్రజావాణి దరఖాస్తులపై మండల ప్రత్యేక అధికారులు శ్రద్ధ వహించాలని అదనపు కలెక్టర్ తెలిపారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ లో పని చేసే ప్రభుత్వ అధికారుల, సిబ్బంది బయోమెట్రిక్ అటెండెన్స్ పై అదనపు కలెక్టర్ సమీక్షించారు. బయో మెట్రిక్ అటెండెన్స్ తక్కువ నమోదు కావడం పట్ల అదనపు కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ సిబ్బంది రెగ్యులర్ గా బయో మెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేయాలని అన్నారు.

Advertisement

Next Story