పేదింట పెళ్లి భారం కాదు : ఎమ్మెల్యే మెచ్చా

by Sridhar Babu |
పేదింట పెళ్లి భారం కాదు : ఎమ్మెల్యే మెచ్చా
X

దిశ, అశ్వారావుపేట : కల్యాణ లక్ష్మి పథకం వల్ల పెళ్లిళ్లు సంతోషంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు అన్నారు. అశ్వారావుపేట మండలంలో మంజూరైన 95 కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను మంగళవారం గిరిజన భవన్ లో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మెచ్చా పంపిణీ చేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పడ్డాక పేదింట పెళ్లి భారం కాకుండా పోయిందన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ మంజూరులో జాప్యానికి తావు లేకుండా ఎప్పటికప్పుడు సంతకాలు చేసి ఫైళ్లను పంపిస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆశిస్సులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. అశ్వారావుపేట వైద్యశాలలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా కృషి చేస్తున్నట్టు తెలిపారు. ఆర్టిఏ సబ్ యూనిట్ ఆఫీస్ ఏర్పాటు అయ్యేందుకు ఎంతో కృషి చేశామని వివరించారు.

నియోజకవర్గ, మండల కేంద్రాల్లో సెంట్రల్ లైటింగ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చిందన్నారు. అభివృద్ధి చేసే పార్టీ ఉండగా పక్క చూపులు చూడాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లూధర్ విల్సన్, ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామ్మూర్తి, జెడ్పీటీసీ చిన్నంశెట్టి వరలక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు బండి పుల్లారావు, కార్యదర్శి జుజ్జూరి వెంకన్నబాబు, పార్టీ టౌన్ ప్రెసిడెంట్ సత్యవరపు సంపూర్ణ, వైస్ ఎంపీపీ చిట్టూరి ఫణీంద్ర, సర్పంచులు నారం రాజశేఖర్, సాధు జ్యోత్స్న భాయ్, మందపాటి రాజా మోహన్ రెడ్డి, తాడేపల్లి రవి, మోటూరి మోహన్, బజరయ్య, చిప్పనపల్లి శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed