''పొంగులేటి వారి పెళ్లి''.. ప్రతి ఇంటికి పెళ్లి పత్రిక, గడియారం..

by Satheesh |
పొంగులేటి వారి పెళ్లి.. ప్రతి ఇంటికి పెళ్లి పత్రిక, గడియారం..
X

దిశ, మణుగూరు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుమార్తె సప్నిరెడ్డి వివాహానికి పినపాక ప్రజలు తప్పక రావాలని పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, డీసీసీబీ డైరెక్టర్, అశ్వాపురం మండల టీఆర్ఎస్ నాయకుడు తుళ్లూరి బ్రహ్మయ్య కోరారు. సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాలకు తమ కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్లి పెళ్లి పత్రిక, గడియారంను అందించారని తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి గడపకు పెళ్లి పత్రిక, గడియారం అందించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. అలాగే పొంగులేటి కుమార్తె వివాహనికి ప్రజలందరూ తప్పక రావాలని కోరారు. ప్రజలు దీవెనలే ఆయన కుమార్తె సప్నిరెడ్డికి ముఖ్యమని అన్నారు. మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యవర్గ సభ్యుల కమిటీ మెంబర్స్.. వివాహానికి వచ్చే ప్రజలందరికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ పంపిణీ కార్యక్రమంలో మండల నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యవర్గ సభ్యుల కమిటీ మెంబర్స్, కార్యకర్తలు, యువత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed