- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Minister Thummala : 8 వేల కోట్లను అడ్డగోలుగా ఖర్చు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం
దిశ, వైరా : సాగుకు జీవం... రైతుకు ఊతం అనే నినాదంతో ఈనెల 15వ తేదీన ఖమ్మంజిల్లా వైరాలో తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగను నిర్వహిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వైరాలో 15న జరిగే రైతు బహిరంగ సదస్సు కేవలం ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగానికే పరిమితం కాదని తెలంగాణ రాష్ట్ర రైతాంగ పండుగ అని ఆయన పేర్కొన్నారు. వైరాలో ఈనెల 15న సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే రైతు బహిరంగ సదస్సు సభాస్థలంలో జరగుతున్న ఏర్పాట్లను వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ ,రాష్ట్ర గిడ్డంగుల, హస్తకళల అభివృద్ధి సంస్థల చైర్మన్లు రాయల నాగేశ్వరరావు, నాయుడు సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ తో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే రాందాస్ నాయక్ అధ్యక్షతన జరిగిన విలేకరుల సమావేశంలో తుమ్మల మాట్లాడారు. 2007 ప్రాంతంలో అప్పటి సీఎం వైఎస్. రాజశేఖర్ రెడ్డి వత్తిడి మేరకు యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ నేతృత్వంలో నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా రూ.72 వేల కోట్ల రైతుల రుణాలను ఏకకాలంలో రద్దు చేసిందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ లోక్ సభ పక్షనేత రాహుల్ గాంధీ వరంగల్ లో ప్రకటించిన డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం మళ్లీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని ఇందిరమ్మ రాజ్యం, ప్రజా ప్రభుత్వం ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీని రూ.31వేల కోట్ల మేర రద్దుచేస్తుందని ఇది ఒక అద్భుతమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2014లో ఎన్నికల హామీ మేరకు రూ. లక్షలోపు రుణాన్ని నాలుగు విడతలుగా అమలుచేసిందని ఆ నిధులు రైతుల రుణాల వడ్డీలకు కూడా సరిపోలేదని విమర్శించారు. 2018లో మళ్లీ రూ.లక్ష రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన బీఆర్ఎస్ ఎన్నికల చివరి సంవత్సరం రైతు వ్యతిరేకతను ఊహించి హైదరాబాద్ ఓఆర్ఆర్ ను తాకట్టు పెట్టి అరకొరగా రుణమాపి చేసిందని ఆరోపించారు. బంగారు బాతు లాంటి ఓఆర్ఆర్ ను అడ్డగోలుగా తాకట్టుపెట్టిందని ఆక్షేపించారు. ఈ నెల 15న వైరాలో రూ.2లక్షల రుణమాఫీ చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి అందజేస్తారని వివరించారు. అందుకు అవసరమైన నిధులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమకూర్చుతున్నారని ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లో అదే పనిలో ఉన్నారని పేర్కొన్నారు. గతంలో రూ.8వేల కోట్లు ఖర్చు చేసినప్పటికీ సీతారామ ప్రాజెక్టు నుంచి చుక్క నీరు కూడా గత పాలకులు ఇవ్వలేకపోయారని విమర్శించారు.
కేవలం మోటర్లు అమర్చి మిగిలిన పనులను గత 5 సంవత్సరాల కాలంలో పట్టించుకోలేదని ఆక్షేపించారు. తమకు లాభసాటిగా ఉన్న పనులకు మాత్రమే రూ.8 వేల కోట్లు ఖర్చు చేసిన గత పాలకులు ఇప్పుడు అడ్డగోలుగా విమర్శలు చేస్తున్నారని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఖర్చు చేసిన నిధులు మోటార్లు గంగపాలు కాకుండా చేయడం కోసమే తాను సీఎం రేవంత్ రెడ్డి ని ఒప్పించి తక్కువ నిధులతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మించి వైరా, మధిర, సత్తువల్లి నియోజకవర్గాలకు గోదావరి జలాలు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామని ఇది విజయవంతం కాబోతుందని తెలిపారు. అదే సమయంలో జూలూరుపాడు, యతాలకుంట టన్నెల్ నిర్మాణాలకు మంజూరు ఇప్పించేందుకు రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమారెడ్డిని ఖమ్మం జిల్లాకు తీసుకువచ్చామని దీన్ని కొంతమంది అపహాస్యం చేసి తనను అవమానిస్తున్నారని తుమ్మల పేర్కొన్నారు . ప్రజాస్వామ్యంలో ఉన్న మాధుర్యం గురించి తనను విమర్శించే వారికి ఇంగితజ్ఞానం కూడా లేదని విమర్శించారు. గత ఐదేళ్లలో సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, ఫారెస్ట్ క్లియరెన్స్ ఇతర అనుమతులు ఎందుకు తీసుకురాలేదని, మిగిలిన పనులను ఎందుకు చేపట్టలేదని నిలదీశారు. ఉమ్మడి రాష్ట్రం సహా తెలంగాణలో ఎన్నెస్పీ, శ్రీశైలం, ఎస్సార్ ఎస్పీ ప్రాజెక్ట్ ల మినహా మిగిలిన అన్ని నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణాల్లో తన భాగస్వామ్యం ఉందని తుమ్మల పేర్కొన్నారు.
అందువలన సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి గోదావరి జలాలే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులోని నీటిని చల్లుకునే అర్హత తనకుం దని పేర్కొన్నారు. తనకు పదవి, టిక్కెట్, అధికారం కోసం ఏనాడూ తాపత్రయం పడలేదని, రైతాంగానికి సాగునీటిని అందించి తన జీవితాన్ని పరిపూర్ణం చేసుకునేందుకే ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేస్తున్నానని స్పష్టం చేశారు. వైరాలో జరిగే భారీ బహిరంగ సదస్సును జయప్రదం చేయాలని కోరారు. అనంతరం వైరా రిజర్వాయర్ ను సందర్శించి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్క్ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, పిసిసి కార్యదర్శి కట్ల రంగారావు, కిసాన్ మోర్చా రాష్ట్ర నాయకులు నలమల వెంకటేశ్వరరావు, వైరా మున్సిపాలిటీ చైర్మన్ సూతకాని జైపాల్, కాంగ్రెస్ నాయకులు పణితి సైదులు, దార్న రాజశేఖర్, వడ్డే నారాయణ, సాదు రమేష్ రెడ్డి , సూరంపల్లి రామారావు, కట్ల సంతోష్, దాసరి దానియేలు పాల్గొన్నారు.