- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Minister Ponguleti : విద్య, వైద్యానికి ప్రభుత్వం పెద్దపీట
దిశ,తిరుమలాయపాలెం : రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్ద పీట వేస్తుందని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Minister Ponguleti Srinivasa Reddy)అన్నారు. మంగళవారం మంత్రి తిరుమలాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 8, 9, 10వ తరగతి విద్యను అభ్యసిస్తున్న బాలికలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సైకిళ్లు పంపిణీ (Distribution of bicycles)చేశారు. ఈ సందర్భంగా వేదికపై మంత్రి పొంగులేటి జ్యోతి ప్రజ్వల చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కష్టపడి చదివితే మంచి ఫలితాలు ఉంటాయని, అదే నిలబడుతుందని అన్నారు. పిల్లల భవిష్యత్ కోసం తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు భరిస్తారని, వారి శ్రమకు తగ్గ ఫలితాలు రాబట్టాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా రూ.637 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించినట్టు తెలిపారు. ప్రైవేటులో చదివితే మంచి డాక్టర్లు, ఇంజనీర్లు అవుతారని అనుకోవద్దని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు.
పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉండకూడదని నూతనంగా 10 వేల మంది ఉపాధ్యాయులను నియమించినట్టు చెప్పారు. విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఫోర్త్ సిటీలో ఇటీవలే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ (Skill University)ప్రారంభం చేసుకున్నట్లు తెలిపారు. మహేంద్రని చైర్మన్ గా నియమించుకొని, మధిర, హుజురాబాద్, ఆదిలాబాద్ లలో బ్రాంచులు ఏర్పాటు చేసుకుంటున్నట్లు, రాబోయే రోజుల్లో పాలేరు లో బ్రాంచి ఏర్పాటు అవుతుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగాలపై ఆధారపడకుండా మీరే పది మందికి ఉద్యోగాలు ఇచ్చే స్థితికి రావాలన్నారు. నియోజకవర్గంలోని 4 మండలాల్లో హైస్కూళ్లకు రూ.2 లక్షల చొప్పున, రూ.8 లక్షలతో సైన్స్ ల్యాబ్ ఏర్పాటు కోసం అవసరమయ్యే నిధులను మంత్రి మంజూరు చేశారు. త్వరలో అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్వో వాటర్ ప్లాంట్ లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
నియోజకవర్గంలో 8, 9, 10, ఇంటర్ చదివే బాలికలకు పీఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సైకిళ్లను అందజేస్తున్నట్లు ఆయన తెలియజేశారు. ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ అని అన్నారు. భవిష్యత్తులో బాలురకు ఏం చేయాలో ఆలోచించనున్నట్లు మంత్రి తెలిపారు. రాబోయే విద్యా సంవత్సరం 2025 గాను ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు శాతం పెంచే బాధ్యత టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందిదే అన్నారు. హైస్కూల్ లో 200 మందికి మించి విద్యార్థుల నమోదు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా బాలికలు చేసిన నృత్య ప్రదర్శనను మంత్రి తిలకించారు. తొలుత మండలంలోని బీరోలు చెరువు కట్ట పునరుద్ధరణ పనులను పరిశీలించి, గోల్ తండాలో శ్రీ భాగ్యలక్ష్మి కాటన్ ఇండస్ట్రీస్ లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడారు.
అక్కడ నుండి జల్లేపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన వారి చిత్రపటలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి సంస్థ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి సోమశేఖరశర్మ, తహసీల్దార్ రామకృష్ణ, ఎంపీడీఓ సిలార్ సాహెబ్, వ్యవసాయ శాఖ ఏడీ సరిత, ఏఓ సీతారాం రెడ్డి, పాఠశాల హెచ్ఎం విజయకుమారి, మద్దులపల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వనవాసం నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు రామసహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, మంగీలాల్, మండల నాయకులు తాటికొండ కిరణ్, కొప్పుల అశోక్, బెల్లం శ్రీనివాస్, బోడ మంగీలాల్, పోట్ల కిరణ్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు లంజపల్లి శ్రీనివాస్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.