లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యురాలు

by Disha News Web Desk |
లొంగిపోయిన మావోయిస్టు మిలీషియా సభ్యురాలు
X

దిశ, భద్రాచలం: నిషేధిత మావోయిస్టు పార్టీ మిలీషియా సభ్యురాలు రాతి చిలక(18) మంగళవారం చర్ల పోలీసులు, సీఆర్‌పీఎఫ్ 141 బెటాలియన్ 'ఏ' కంపెనీ పోలీసుల ఎదుట లొంగిపోయారు.‌ చర్ల సీఐ అశోక్, సీఆర్‌పీఎఫ్ అధికారి సీతారామ్ సింగ్, చర్ల ఎస్‌ఐలు రాజువర్మ, వెంకటప్పయ్యలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. లొంగిపోయిన చిలక అనే యువతి ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా పెద్దఊట్ల గ్రామానికి చెందిన ఈమెను గత మూడేళ్ల కిందట మైనర్‌గా ఉన్నప్పుడు ఆర్‌పీసీ సభ్యులు నాపా లక్మా, కామయ్య, సహదేవ్ అనేవారు బెదిరించి బలవంతంగా మిలీషియాలో చేర్పించినట్లు పోలీసులు తెలిపారు. ఇపుడు మైరుగైన జీవనం గడపటం కోసం చిలక లొంగిపోయినట్లుగా అన్నారు. మావోయిస్టు నాయకులు, దళ సభ్యులు ఆదివాసీ గ్రామాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ ఆదివాసీ యువతీయువకులను, మైనర్ బాలికలను మిలీషియా, మావోయిస్టు పార్టీ దళాల్లో బలవంతంగా చేర్పించి వారి భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని సీఐ తెలిపారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి అడ్డుపడుతున్న మావోయిస్టులకు సహకరించవద్దని, మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా పోరాడి మీ హక్కులు కాపాడుకోవాలని ఆదివాసీలకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. మెరుగైన జీవనం గడపటం కోసం మావోయిస్టు పార్టీకి చెందిన దళ సభ్యులు స్థానిక ప్రజాప్రతినిధుల ద్వారా సమాచారం ఇచ్చి లోకల్ పోలీసుల ఎదుట లొంగిపోవాలని చర్ల సీఐ బి.అశోక్ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు.

Advertisement

Next Story