- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ కోసం ఐక్యం అవుదాం
దిశ, ఖమ్మం : డ్రగ్స్, మాదక ద్రవ్యాల రహిత తెలంగాణ కోసం అందరూ ఐక్యం అవుదామని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుగుబెల్లి నర్సిరెడ్డి పిలుపునిచ్చారు. డ్రగ్స్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో స్థానిక భక్త రామదాసు కళాక్షేత్రంలో జిల్లా సదస్సు జిల్లా కార్యదర్శులు షేక్.బసీరుద్దీన్, తుడుం.ప్రవీణ్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో డ్రగ్స్ మాదక ద్రవ్యాల వాడకం రోజురోజుకి పెరిగిపోతున్నాయని, అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా సిరియస్ గా తీసుకోవడం అభినందనీయం అన్నారు. ప్రజలంతా ఐక్యంగా మాదక ద్రవ్యాలను తరిమికొట్టి డ్రగ్స్ రహిత తెలంగాణను నిర్మిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.
అనంతరం ప్రొవిబిషన్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ బి.కృష్ణ మాట్లాడుతూ డ్రగ్స్ మాఫియా ప్రధానంగా విద్యార్థులను, యువకులను టార్గెట్ చేస్తూ చాక్లెట్స్ లో పెట్టి వ్యాపారం చేస్తున్నారని, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా డ్రగ్స్ కి బానిస అయితే తమని సంప్రదిస్తే కౌన్సెలింగ్ చేస్తామని అనారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు, డీవైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యాసంస్థల్లో యాంటి డ్రగ్ కమిటీలను వేయాలని, డ్రగ్ మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. ప్రైవేట్ జూనియర్ కళాశాలల జిల్లా అధ్యక్షుడు శేషగిరి రావు, ట్రస్మా రాష్ట్ర, జిల్లా నాయకులు కరస్పాండెంట్స్ రామ్ చందర్ రావు, శేషిదర్ రెడ్డి, మతిన్, భాస్కర్, అశోక్ రెడ్డి, యోగి మాట్లాడుతూ
డ్రగ్స్ నియంత్రణకు అవగాహనే ఆయుధం అన్నారు. ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శులు షేక్.బసీరుద్దీన్, తుడుం.ప్రవీణ్ మాట్లాడుతూ భవిష్యత్ లో డ్రగ్స్, మదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా జిల్లా వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలలో అవగాహన సదస్సులు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు పి.సుధాకర్, ఎం.ప్రభాకర్, ఆయా సంఘాల జిల్లా నాయకులు చింతల.రమేష్, సంగీత, సత్య, సుజాత, శీలం వీరబాబు, సత్తెనపల్లి నరేష్, కొంగర నవీన్, ముత్తరావు, ఉపేందర్ నాయక్, కూరపాటి శ్రీను, సాయి, ప్రేమ్ కుమార్, వెంకటేష్, వరుణ్, తాటి వెంకటేశ్వర్లు, మురళి, పాషా, వీరాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
- Tags
- MLC Narsireddy