- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తెలంగాణలో Maoist పార్టీది ముగిసిన అధ్యాయం: ఎస్పీ డా. వినీత్ జి
దిశ ప్రతినిధి, కొత్తగూడెం: నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వినీత్ జి ఆదివారం సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణలో ప్రజల మద్దతును పూర్తిగా కోల్పోయిందని ఆయన ఆ ప్రకటనలో వెల్లడించారు. మావోయిస్టులు ఆదివాసుల అభివృద్ధి నిరోధకులుగా మారి వారి సంఘవిద్రోహ చర్యలను పరిరక్షించుకొవడానికి ఆదివాసులను పావులుగా వాడుకుంటూ ఛత్తీస్‌గఢ్ అడవుల్లో తలదాచుకుంటున్నారని అన్నారు. మావోయిస్టు నాయకులు ఆదివాసీలపై పాల్పడుతున్న దౌర్జన్యాలను గ్రహించిన ప్రజలు మావోయిస్టు పార్టీకి సహకరించడం లేదని పేర్కొన్నారు. ఛత్తీస్‌గఢ్ లోని తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టులు నిర్వహించే మీటింగులకు తెలంగాణ గ్రామాల నుండి ప్రజలు ఎవరూ హాజరుకాకుండా మావోస్టులను తిరస్కరించడం జరిగిందని, గతవారం మావోయిస్టు పార్టీ పి.ఎల్.జి.ఎ ఆవిర్బావ వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని పెద్ద ఎత్తున కరపత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రచారం చేసినా ఎలాంటి కార్యక్రమాలు చేయలేక ప్రజల సహకారం కొల్పోయి భంగపడ్డారని అన్నారు.
తెలంగాణ స్టేట్ మావోయిస్టు పార్టీ కమిటీ నాయకులు ఛత్తీస్‌గఢ్ లోని అడవుల్లో కూర్చొని తమ విలాసవంతమైన జీవితాల కోసం ఆదివాసీ ప్రజల నుండి, కాంట్రాక్టర్ల నుండి, రైతుల వద్ద నుండి బలవంతంగా డబ్బులు వసూలు చేయడానికి వివిధ రకాల పద్దతుల ద్వారా ప్రయత్నిస్తున్నారని, తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతాల్లో నివసించే మైనర్ బాలబాలికలను మావోయిస్టు పార్టీలోకి బలవంతంగా చేర్చుకోవడానికి గత కొంతకాలంగా వారు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయని అన్నారు. మావోయిస్టు పార్టీ అగ్ర నాయకులు వారి స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలోని క్రింది స్థాయి క్యాడర్ పై చూపుతున్న వివక్షతను గ్రహించి ఇప్పటికే చాలామంది సభ్యులు పోలీసుల ఎదుట లొంగిపోవడం జరిగిందని తెలిపారు. తెలంగాణలో వారి ఉనికిని చాటుకోవడానికి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు, పశువులు సంచరించే ప్రదేశాలలో బూబీ ట్రాప్స్, ల్యాండ్ మైన్స్, ప్రెజర్ మైన్స్ లాంటి పేలుడు పదార్థాలను అమర్చుతూ ఆదివాసీల ప్రాణాలకు ముప్పువాటిల్లెలా ప్రవర్తిస్తున్నారని తెలియజేశారు. మావోయిస్టు పార్టీ నాయకులు పాల్పడే చట్టవ్యతిరేక కార్యకలాపాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మావోయిస్టు పార్టీది ముగిసిపోయిన అధ్యాయం అని వివరించారు.
Read More....