- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ సంక్షేమ వసతి గృహం క్షేమమేనా..
కొత్తగూడెంలోని ఎస్సీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం వరుస వివాదాలు, విద్యార్థినుల ఆందోళనతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నది. ఇటీవల అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు, నీళ్లలో నలకలు వచ్చిన ఘటన మరువక ముందే తాజాగా విద్యార్థినుల పై దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. వసతిగృహం వార్డెన్ పర్యవేక్షణ లోపం, నిర్లక్ష్యంతోనే ఇటువంటి వరుస ఘటనలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ఇటీవల కలెక్టర్ జితేశ్ వీ పాటిల్ హాస్టల్‌ను పరిశీలించి, వార్డెన్‌కు పలుసూచనలు చేసినా.. ఎటువంటి మార్పు కనిపించడం లేదు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, శుభ్రత పాటించకపోవడం వంటివి ఇక్కడ సర్వసాధారణం అయిపోయాయి. ఇక్కడి ఇబ్బందులను విద్యార్థినులు బయటికి చెబితే వారిని టార్గెట్ చేసి, కిందిస్థాయి సిబ్బందితో దాడులు చేయిస్తున్నారని సమాచారం. దీని కారణంగా ప్రతి వివాదంలోనూ అవుట్సోర్సింగ్ సిబ్బంది బలవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఈ హాస్టల్ వార్డెన్ గత 16 ఏండ్లుగా ఉంటున్నారని, అసలు బదిలీ సంగతి అటుంచితే ఏకంగా ఇన్‌చార్జి వార్డెన్ నుంచి ఏఎస్‌సీడబ్ల్యూఓగా పదోన్నతి పొందడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
దిశ, కొత్తగూడెం : అన్నంలో పురుగులు, కూరల్లో వెంట్రుకలు, నీళ్లలో నలకలు వచ్చిన ఘటన మరువక ముందే విద్యార్థినుల పై దాడి ఘటన వెలుగులోకి వచ్చింది. వివాదాలకు చిరునామాగా మారింది. కొత్తగూడెంలోని ఎస్సీ బాలికల పోస్ట్ మెట్రిక్ వసతి గృహం. ఇటీవల కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, హాస్టల్‌ను పరిశీలించి వార్డెన్‌కు పలు సూచనలు చేసినప్పటికీ ఎటువంటి మార్పు కనపడటం లేదు. వసతి గృహం వార్డెన్ పర్యవేక్షణ లోపంతో, నిర్లక్ష్యంతోనే ఇటువంటి వరుస ఘటనలు జరుగుతున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రతిసారి ఎలాంటి వివాదం ఏర్పడిన కేవలం అవుట్ సోర్సింగ్ కిందిస్థాయి సిబ్బందినే కారణంగా చూపిస్తున్నారు గాని, వార్డెన్ నిర్లక్ష్యమని ఉన్నతాధికారులు తన పై చర్యలు కాదు కదా, కనీసం మందలించేందుకు కూడా సాహసం చేయడం లేదు.
పర్యవేక్షణ లోపంతోనే..
వార్డెన్ నిర్లక్ష్యమే వరుస వివాదాలకు కారణమని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కొత్తగూడెం పోస్ట్ మెట్రిక్ వసతి గృహం పై, విద్యార్థినుల పై, వసతి గృహ సిబ్బంది పై పర్యవేక్షణ లోపంతోనే ఇటువంటి వరుస సంఘటనలు జరుగుతున్నాయని సమాచారం. నవంబర్ నెలలో సుమారు పది రోజుల పాటు భోజనంలో కోడిగుడ్డు కూడా అందించలేదని తెలుస్తోంది. ఈ అంశం వార్డెన్‌కు తెలిసి జరిగిందా, తెలియక జరిగిందా సిబ్బంది, అధికారులకే తెలియాలి. ఎస్సీ పోస్ట్ మెట్రిక్ బాలికల వసతి గృహం ఇన్‌చార్జి ప్రస్తుతం ఉన్న వార్డెన్ విధులు నిర్వహిస్తున్నారు. కాని దీంతో పాటు రెగ్యులర్ వార్డెన్‌గా కొత్తగూడెం కోర్టు సమీపంలోని ఎస్సీ బాలికల ప్రీ మెట్రిక్ వసతి గృహంలో విధులు నిర్వహిస్తున్నారు. దీంతో పాటు ఇటీవల రెగ్యులర్ కొత్తగూడెం ఏఎస్సీడబ్ల్యుఓ రిటైర్డ్ అవడంతో దీంతో సదరు వార్డెన్‌కు ఏఎస్సీడబ్ల్యూఓగా అదనపు బాధ్యతలు ఇచ్చారు.
ఇటు రెండు హాస్టళ్లకు వార్డెన్‌గా, ఏఏసీడబ్ల్యూగా విధులు నిర్వహించేందుకు తీవ్ర పని ఒత్తిడిలో ఉండి, హాస్టళ్లకు సరిగ్గా రావడం లేదని, కారణంగా విద్యార్థినుల పై పర్యవేక్షణ లోపించడం, కిందిస్థాయి సిబ్బంది లోని కొందరు వారికి వారే వార్డెన్‌గా చలామణి అవుతూ విద్యార్థినులపై దాడికి సైతం తెగబడుతున్నారు. మెనూ ప్రకారం భోజనం అందించకపోవడం, శుభ్రత పాటించకపోవడం వంటివి సర్వసాధారణంగా జరిగిపోతున్నాయి. విద్యార్థినులు విలేకరులకు సమాచారం అందించినట్లు ఎవరిపైన అయినా అనుమానాలు వస్తే వారిని టార్గెట్ చేసి కింది స్థాయి సిబ్బందితో దాడులు చేయిస్తున్నారని సమాచారం. దీని కారణంగా ప్రతి వివాదంలోనూ అవుట్సోర్సింగ్ సిబ్బంది బలవుతుంది.
16 ఏండ్లుగా ఒకే చోట విధులు ?
కొత్తగూడెం ఎస్సీ బాలికల ప్రీ మెట్రిక్ వసతిగృహ అధికారి మాత్రం 16 ఏళ్ల నుంచి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నారు. 2014లో, 2024లో బదిలీల కోసం కౌన్సిలింగ్ నిర్వహించినప్పటికీ ఈ వార్డెన్ స్థానం మాత్రం పదిలంగా ఉండడం వెనక 'పెద్ద' హస్తమే ఉన్నట్లు తెలుస్తోంది. కమిషనరేట్ స్థాయిలో ప్రభావం చూపించే బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో 16 ఏండ్లుగా ఒకే చోట వార్డెన్‌గా విధులు నిర్వహిస్తున్నారని చర్చ జరుగుతోంది. అసలు బదిలీ సంగతి అటు ఉంచితే ఏకంగా ఇన్‌చార్జి వార్డెన్ నుంచి ఏఎస్‌సీడబ్ల్యూఓగా పదోన్నతి పొందడం పలువురిని ఆశ్చర్యాన్ని గురిచేసింది. కలెక్టర్, ఎస్సీ వెల్ఫేర్ రాష్ట్ర అధికారులు జోక్యం చేసుకుని దీనిపై విచారణ చేయాలని పలు విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు