- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదోడి సొంతింటి కల సాకారమే కేసీఆర్ లక్ష్యం: ఎమ్మెల్యే సండ్ర
దిశ, సత్తుపల్లి: పేదోడి సొంతింటి కల సాకారమే కేసీఆర్ లక్ష్యమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. పట్టణ పరిధిలోని జలగం వెంగళరావు పార్కు సమీపంలో రూ.5.7కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మించిన డబల్ బెడ్ రూం ఇళ్లను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా పేద ప్రజలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను ప్రారంభించి, ఇళ్ల పట్టాలు పంపిణీ చేశామన్నారు. అదేవిధంగా లబ్ధిదారులకు నూతన వస్త్రాలు, పాత్రలు పంపిణీ చేశామని తెలిపారు.
ప్రజా సంక్షేమం కోసమే అనేక పథకాలకు సీఎం కేసీఆర్ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. కొందరు కావాలని స్వార్ధ రాజకీయాల కోసం ఆరోపణలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవద్దన్నారు. అనంతరం కేసీఆర్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి అందరికీ పంచి పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో సూర్యనారాయణ, ఎమ్మార్వో శ్రీనివాసరావు, ఎంపీడీవో సుభాషిని, మున్సిపల్ కమిషనర్ సుజాత, ఎంపీపీ శంకర్రావు హైమావతి, జడ్పీటీసీ రామారావు, మున్సిపల్ చైర్మన్ కే.మహేష్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ సుజలా రాణి, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, వార్డ్ కౌన్సిలర్లు, డబల్ బెడ్ రూం లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు