Karakatta : గోదావరికి రెండువైపులా కరకట్ట

by Sridhar Babu |   ( Updated:2024-08-01 13:18:25.0  )
Karakatta : గోదావరికి రెండువైపులా కరకట్ట
X

దిశ, భద్రాచలం : భద్రాచలంలోని గోదావరికి రెండు వైపులా కరకట్ట నిర్మాణం చేపట్టి వరద ముంపు నష్టం నుండి కాపాడాలని అసెంబ్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మి నారాయణ, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రతి సంవత్సరం గోదావరి వరదల కారణంగా భద్రాచలం పట్టణం, చుట్టు పక్కల గ్రామాలు ముంపునకు గురి అవుతున్నాయని, ఈ ముంపు

సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గోదావరికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి దృష్టికితీసుకువెళ్లారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలం వద్ద గోదావరి నదికి ఇరువైపులా కరకట్ట నిర్మాణం కోసం 4000 కోట్ల రూపాయలు త్వరలోనే మంజూరు చేస్తాం అన్నారు. దీంతో పినపాక నియోజకవర్గంలోని బూర్గంపహాడ్ తో పాటు పలు గ్రామాల ప్రజలకు ప్రతి సంవత్సరం వరద ముంపు నుండి విముక్తి లభించే అవకాశం ఉంది.

Advertisement

Next Story

Most Viewed