- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కల్యాణం.. కమనీయం
దిశ, వైరా : మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో పార్వతీ పరమేశ్వరుల కల్యాణాన్ని శనివారం రాత్రి అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణం సందర్భంగా పీటలపై సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క, నందిని దంపతులతో పాటు పలువురు దంపతులు కూర్చుని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కళ్యాణాన్ని కనులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు హాజరయ్యారు. వైరా తో పాటు తల్లాడ, బోనకల్, కొణిజర్ల, గంపలగూడెం తదితర మండలాల భక్తులు స్వామివారి కల్యాణాన్ని చూసేందుకు స్నానాల లక్ష్మీపురం గ్రామానికి తరలివచ్చారు. కల్యాణ నిర్వహణ సమయంలో భక్తులతో స్వామివారి ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. శివ నామస్మరణతో స్నానాల లక్ష్మీపురం గ్రామం మార్మోగింది. దేవాలయంలో స్వామివారి కల్యాణాన్ని ప్రధాన అర్చకుల బృందం నిర్వహించింది.
కళ్యాణ మహోత్సవ కార్యక్రమాన్ని దేవాలయ చైర్మన్ చింత నిప్పు రాంబాబు, ఈవో సూర్యదేవర శ్రీనివాసరావు పర్యవేక్షించారు. కల్యాణాన్ని అనంతరం మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఎంతో పురాతన చరిత్ర కలిగిన స్నానాల లక్ష్మీపురం లోని రామలింగేశ్వర స్వామి దేవాలయ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వచ్చే శివరాత్రి నుండి స్వామివారి కల్యాణాన్ని భక్తులంతా కనులారా తిలకించే విధంగా ఆలయం బయట ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ చింతనిపు రాంబాబు, ఈవో సూర్యదేవర శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ అమ్మిక రామారావు, ఉప సర్పంచ్ మల్లు రామకృష్ణ, కాంగ్రెస్ వైరా నియోజకవర్గ ఇంచార్జ్ మాలోత్ రాందాస్ నాయక్, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.