ఎమ్మెల్యే మెచ్చాకు మరో కీలక పదవి..?? హుటాహుటిన హైదరాబాద్‌కు పయనం

by Satheesh |
ఎమ్మెల్యే మెచ్చాకు మరో కీలక పదవి..?? హుటాహుటిన హైదరాబాద్‌కు పయనం
X

దిశ, అశ్వారావుపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావును ట్రైకార్ చైర్మన్ పదవి వరించనుందని జోరుగా ప్రచారం జరుగుతుంది. శుక్రవారం జరిగిన జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సభానంతరం ఎమ్మెల్యే మెచ్చా హుటహుటీన హైదరాబాద్‌కు పయనమవడం ట్రైకార్ చైర్మన్ పదవి కోసమే అని ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇందుకు కారణం లేకపోలేదు.. ఎమ్మెల్యే మెచ్చా టీడీపీ నుంచి టీఆర్ఎస్‌లో చేరే సమయంలో సిట్టింగ్ టికెట్‌తో పాటు ట్రైకార్ చైర్మన్ పదవి హామీ తీసుకున్నట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.

అంతేకాక.. గత అశ్వారావుపేట ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు కూడా టీఆర్ఎస్‌లో చేరిన తర్వాత ట్రైకార్ చైర్మన్ పదవిని అలంకరించారు. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాదులో జరగనున్న గిరిజన భవన్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా గిరిజన ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావుకు ట్రైకార్ చైర్మన్ పదవి ప్రకటన ఉండనుందన్నా సమాచారం ప్రస్తుతం టీఆర్ఎస్ శ్రేణుల్లో చక్కర్లు కొడుతుంది.

Advertisement

Next Story

Most Viewed