- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఖమ్మం కార్పొరేషన్‌లో అక్రమార్కులు
దిశ, ఖమ్మం సిటీ: ఖమ్మం కార్పొరేషన్ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం ముఖ్య అధికారి ఆడింది ఆట.. పాడింది పాటగా మారింది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని అందినకాడికి దండుకుంటున్నారు. అక్రమార్కులు ఇస్తున్న ముడుపులు తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఆ అధికారి అండ చూసుకున్న కొందరు అక్రమార్కులు అనుమతి ఒకలా, నిర్మాణం మరోలా చేస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఇలాగే రాపర్తినగర్ బైపాస్ రోడ్‌లో రోడ్డు వెంబడి చేపట్టిన భవన నిర్మాణంపై ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది రాజకీయ నాయకుల అండ, ప్రణాళిక విభాగంలో పనిచేస్తున్న ఓ ముఖ్య ఉద్యోగి సహకారంతో అక్రమార్కులు పేట్రేగిపోతున్నట్లు తెలుస్తున్నది. అక్రమ నిర్మాణాల వ్యవహారంలో ఆ ఉద్యోగి పెద్ద ఎత్తున ముడుపులు తీసుకుంటున్నట్లు ఆరోపణ వెలువెత్తుతున్నాయి.
నగరంలో బహుళ అంతస్తులు నిర్మాణం చేపట్టేవారు కనీస నిబంధనలను పాటించడం లేదంటే వారి అండ ఏ రీతిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. అంతా తానే కావడంతో నగరపాలక సంస్థ కమిషనర్‌ను సైతం ఏమార్చే పనిలో పడ్డారు. కొంతమంది మున్సిపల్ లైసెన్స్ సర్వేయర్ల అండతో తనకు నచ్చిన విధంగా ప్లానింగ్ గీయిస్తూ నిబంధనలకు నీళ్లు వదులుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఇంకొంతమంది అర్హత లేని మున్సిపల్ సర్వేయర్లు ఆ ప్రణాళిక అధికారికి దగ్గరగా ఉంటూ ఇష్టం వచ్చినట్టు ప్లానింగ్ గీస్తూ అప్పటికప్పుడే పెద్ద ఎత్తున సొమ్ము వసూలు చేసి వాటాలు వేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరి కొంతమంది ఆ విభాగంలో పనిచేస్తూ ప్రైవేట్ ప్లానర్లు ఇండ్ల నిర్మాణలకు మ్యాపులు గీస్తున్నట్లు సమాచారం. నగరంలో ప్రధానంగా నెహ్రునగర్‌లో ప్రశాంతి హాస్పిటల్ ఎదురుగా ఉన్న బిల్డింగ్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని, ఎన్‌ఎస్‌టీ రోడ్‌లో బొల్లికొండ శ్రీదేవి హాస్పిటల్ ఎదురుగా బిల్డిండ్ నిర్మాణం, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఎదురుగా బిల్డింగ్ నిర్మాణంలో ఈ అధికారి పెద్ద ఎత్తున ముడుపులు అందాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే నిర్మాణ దారులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అక్రమ నిర్మాణ దారులపై చర్యలు తీసుకుని కార్పొరేషన్ అభివృద్ధికి దోహదపడాలని ప్రజలు కోరుతున్నారు.