- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సీఎస్‌సీ హెల్త్ కేర్ పేరుతో ఘరానా దోపిడీ.. రూ.కోట్లలో ప్రభుత్వ సొమ్ము స్వాహా
దిశ, ఖమ్మం సిటీ: తెలంగాణ రాష్ట్రంలో భవన కార్మికులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలంటూ 2022 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం సీఎస్‌సీ అనే హెల్త్ కేర్ సెంటర్‌కు కాంట్రాక్టును కట్టబెట్టింది. అయితే ఈ స్కీంలో కొందరు అక్రమార్కులు ఘరానా దోపిడీకి తెర లేపారు. మొత్తం మూడు జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పి ప్రభుత్వ సొమ్మును రూ.కోట్లలో కాజేసినట్లుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కార్మికుడికి చేయాల్సిన ఆరోగ్య పరీక్షలు పూర్తిస్థాయిలో చేసి వారికి ఏ జబ్బు ఉందో చెప్పి ప్రభుత్వం నుంచి తదుపరి చికిత్సలతో సహా మందులు అందించాల్సి ఉంటుంది. అదుకోసం ఒక్కో కార్మికుడికి ప్రభుత్వం రూ.3,256 చెల్లిస్తుంది. ముంబైలో ఉన్న ఆ కంపెనీ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వాటి బ్రాంచ్‌లను ఏర్పాటు చేసుకుని జిల్లా వైద్య శాఖ అనుమతులు లేకుండానే పరీక్షలు నిర్వహిస్తున్న తతంగా వెలుగులోకి వచ్చింది.
ఇప్పటికే మూడు జిల్లాల్లో సుమారు 80 వేలకు మందికి పైగా కార్మికులకు పరీక్షలు నిర్వహించినట్లుగా సమాచారం. అందులో సగం మందికి పైగా పరీక్షలు నిర్వహించి మిగతా డబ్బు మాత్రం వారి ఖాతల్లోకి వెళ్లాయి. సీఎస్‌సీ హెల్త్‌కేర్ వాళ్లకు జిల్లాలో కార్మిక శాఖ కార్డులు కలిగి ఉన్న జాబితాను తీసుకుని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, కార్డుదారుల నెంబర్‌తో ఆ సంస్థలో పని చేస్తున్న సిబ్బంది రక్త నామూనాలు సేకరించి ఫేక్ రిపోర్టులు ప్రభుత్వానికి పంపి నిధులు స్వాహా చేస్తన్నారన్న ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. రక్త నామూనా సేకరించే క్యాంపుల్లో పని చేసే సిబ్బందికి ఎటువంటి అర్హతలు లేకుండానే రోగుల నుంచి రక్తాన్ని సేకరిస్తున్నారని టాక్. ఈ విషయంపై వైద్యశాఖ అధికారులను వివరణ కోరగా తమకు ఎలాంటి సమాచారం తెలియదని సమాధానం చెప్పారు.
ఖమ్మం నగరంలో ఇటీవల ఓ మహిళకు రక్త పరీక్షలు నీర్వహించి ఆమేకు యూరిక్ యాసిడ్ లేనప్పటికీ ఉందీ అని తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. అయితే, సదరు మహిళ కుమారుడు సీఎస్‌సీ సెంటర్‌కు వెళ్లి అక్కడున్న సిబ్బందిని నిలదీయగా స్కాం వెలుగులోకి వచ్చింది. అయితే, హెల్త్ కేర్ సెంటర్‌లో ఈసీజీ లాంటి పరికరాలు లేనప్పటికీ ఉన్నట్లుగా రిపొర్టులు ఇస్తున్నారు. ఇప్పటివరకు ఏ కార్మికుడికి వైద్యం అందడం లేదనడంలో అతిశయోక్తి ఏమి లేదు. అదేవిధంగా మరో కార్మికుడికి సీఎస్‌సీ చేసి వైద్య పరీక్షల్లో హెచ్‌ఐవీ పాజిటివ్ అని తేలితే అతడు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా నెగటివ్ వచ్చింది. ఈ విషయంపై సంస్థ వారిని నిలదీయలేక కార్మికుడు ఏం చేయలేక నిస్సాహయ స్థితిలో ఉండిపోయాడు. ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు స్పందించి ఘటన పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కార్మికులు కోరుతున్నారు.