నేనూ రైతునే.. ఆ కష్టాలు నాకు తెలుసు..

by Sridhar Babu |
నేనూ రైతునే.. ఆ కష్టాలు నాకు తెలుసు..
X

దిశ, ఖమ్మం రూరల్ ​: తాను కూడా రైతునేనని, వారి కష్టాలు తెలుసని కేంద్రం వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్​సింగ్​ చౌహన్​ అన్నారు. వరదల వలన దెబ్బతిన్న పంటలను పరిశీలించేందుకు శుక్రవారం ఖమ్మం జిల్లాకు వచ్చిన కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివారజ్​సింగ్​ చౌహన్​కు రాష్ర్ట రెవెన్యూశాఖ, సమాచారశాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావులు ఘనస్వాగతం పలికారు. ఖమ్మం జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర హోం సహాయశాఖ మంత్రి బండి సంజయ్​, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో కలిసి కూసుమంచి మండలంలోని నానుతండా, నర్సింహుగూడెంలో దెబ్బతిన్న పంటలను, రహదారులను కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివారజ్​సింగ్​ చౌహన్ పరిశీలించారు. అనంతరం పాలేరు నవోదయ పాఠశాలలో ఫొటో ఎగ్జిబిషన్​ తిలకించి, రైతులతో మాట్లాడారు.

వరదల కారణంగా పంటలు బాగా దెబ్బతిన్నాయని, మిర్చి పంటలు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విపత్తుల వలన కలిగిన నష్టాన్ని తెలుసుకునేందుకు పీఎం మోడీ తనను పంపించారని తెలిపారు. తాము రాజకీయాలు చేయడానికి రాలేదని, రైతుల కోసం వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. నష్టపోయింది పంటలే కాదు.. వారు పెట్టిన పెట్టుబడి కూడా అన్నారు. పంటను కోల్పోయిన రైతులు ధైర్యంగా ఉండాలన్నారు. తాము మీకు తోడుగా ఉంటాం అన్నారు. రైతులు కంటతడి పెట్టవద్దన్నారు. నష్టం ఎంత జరిగిందో పరిశీలించాం.. అధికారులతో కూడా అంచనాలు తెప్పించుకుని న్యాయం ఎలా చేయాలో ఆలోచన చేసి ప్రకటన చేస్తామని కేంద్రమంత్రి అన్నారు. వారికి మోడీ సర్కార్​ అండగా ఉంటుందన్నారు.

రైతులు సాగు చేసేందుకు సిద్దంగా ఉండాలని, సబ్సిడీ పై విత్తనాలను అందజేస్తామని తెలిపారు. గతంలో ఇలాంటి పరిస్థితులు చూడలేదన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ఈ విపత్తుకు ఎలా ఉపయోగపడతాయో చూస్తామన్నారు. గత ప్రభుత్తం విపత్తు నిధులను పక్కదారిపట్టించిందని విమర్శించారు. గత పాలనలలో ఫసల్​ బీమాను సైతం రాష్ర్టంలో అమలు చేయలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సైతం గత ప్రభుత్వం అమలు చేయలేదని కేంద్రం మంత్రి విమర్శించారు. ఈసారి అలా జరగకుండా చూస్తామన్నారు.

Advertisement

Next Story

Most Viewed