హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి

by Sridhar Babu |
హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలి
X

దిశ,సత్తుపల్లి : హిందూ సంస్కృతిని ప్రపంచానికి చాటి చెప్పాలని రెవెన్యూ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సత్తుపల్లి పట్టణంలోని సింగరేణి కాలరీస్ క్వార్టర్, జూపల్లి హాస్పిటల్ రోడ్, శ్రీ కోదండ రామాలయం, ప్రసన్న గణపతి దేవాలయంలో ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల వద్ద సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హిందూ సంస్కృతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పాలన్నారు. నవరాత్రి ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్న సత్తుపల్లి ప్రజలను అభినందించారు.

ఈ సందర్భంగా పలు మండపాల కమిటీ సభ్యులు పొంగులేటిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ దోమ ఆనంద్, కల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ భాగం నీరజ ప్రభాకర్ చౌదరి, మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజలా రాణి, పట్టణ కౌన్సిలర్స్, ఎండి. కమల్ పాషా, గ్రాండ్ మౌలాలి, దూదిపాల రాంబాబు, పొంగులేటి అభిమానులు, కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కమిటీ సభ్యులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Advertisement

Next Story

Most Viewed