- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పొంగులేటిపై భారీగా బెట్టింగ్స్.. మాజీ MP ఆ పార్టీలోనే చేరుతారంటూ లక్షల్లో పందేలు!
దిశ బ్యూరో, ఖమ్మం: పొంగులేటి ఏ పార్టీలో చేరేది ఇంకా కన్ఫామ్ కాలేదు.. ఎప్పుడు చేరుతారో కూడా ఇంకా స్పష్టత లేదు. ఏది ఏమైనా త్వరలో ఏదోఒక నిర్ణయం తీసుకోక తప్పదు. అయితే ఆయన నిర్ణయం మాత్రం అన్ని పార్టీల్లో ఆసక్తి నెలకొంది. శ్రీనివాసరెడ్డి పార్టీ మారే విషయమై తీవ్రచర్చ జరుగుతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల్లో కూడా కొంతమంది పొంగులేటి పలానా పార్టీలో చేరుతారని బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. ఖమ్మం సరిహద్దులోని ఆంధ్రా ప్రాంతంలో సైతం ఏ పార్టీలో చేరుతారనే విషయమై యువకులు ఎక్కువగా బెట్టింగ్ కాస్తున్నట్లు సమాచారం. పలు ప్రైవేట్ ఏజెన్సీలు, సోషల్ మీడియా గ్రూపులు సైతం పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఒపీనియల్ పోల్స్ కూడా పెడుతున్నాయి.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోలనే కాదు.. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆయన అభిమానులు ఉన్నారు. రాష్ట్ర రాజకీయాలను ఎంతో కొంత ప్రభావం చూపగల నాయకునిగా పేరుంది. ఈ నేపథ్యంలో పొంగులేటి అధికార పార్టీతో విభేదించి బయటకు వచ్చిన విషయం తెలిసిందే.. ఆయనకు కాంగ్రెస్, బీజేపీ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఏ పార్టీలో చేరుతారనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.. కానీ కొంతకాలంగా సోషల్ మీడియాలో పొంగులేటి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారనో... లేక బీజేపీలో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఆయన ఏ పార్టీలో చేరుతానే విషయమై అందరిలోనూ గందరగోళం నెలకొంది. ఆయనతో ఉండే సన్నిహితులు సైతం చెప్పలేని పరిస్థితులు కానీ బీజేపీ, కాంగ్రెస్ పెద్దలు మాత్రం పొంగులేటి తమ పార్టీలో చేరుతున్నారంటూ ప్రచారం చేయడమే గందరగోళానికి కారణం గా తెలుస్తోంది.
లక్షల్లో బెట్టింగులు..
పొంగులేటి ఏ పార్టీలో చేరుతారనే గందరగోళం నెలకొన్న దృష్ట్యా కొంతమంది ఆయన పలానా పార్టీలో చేరుతారంటూ లక్షల్లో బెట్టింగులు కాస్తున్నట్లు సమాచారం. ఆయన అభిమానులు సహా పలు పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులు, ఎక్కువగా యువత పందెం కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఖమ్మం జిల్లా సరిహద్దునున్న ఆంధ్ర ప్రాంతంపు యువత సైతం బెట్టింగులకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. ఎక్కువగా కాంగ్రెస్ లో చేరుతారని.. తర్వాత కాషాయం కండువా కప్పుకుంటారని పందెం కాస్తున్నట్లు చెబుతున్నారు. మరికొంతమంది కొత్త పార్టీ పెడతారని.. ఇంకొంతమందేమో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారని పందెం కాస్తున్నట్లు తెలుస్తుంది.
ఎక్కువగా కాంగ్రెస్ లో చేరుతారని..
బెట్టింగులో ఎక్కువగా కాంగ్రెస్ లో చేరుతారని కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీజేపీకి ఉమ్మడి జిల్లాలో అంత పట్టులేదని.. ఇంత కాలం ముందుకు నడిపించే నాయకుడు లేక ఆ పార్టీ కాడర్ లోనే నిస్తేజం ఉందని.. రాష్ట్ర నాయకులు తప్ప జిల్లా స్థాయిలో గట్టి నాయకులు ఎవరూ లేరని.. అందుకే కాంగ్రెస్లో చేరుతారనే ఎక్కువగా పందెం కాస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ అయితే గతంలో ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ కంచుకోట అని.. పొంగులేటి అభిమానులతో పాటు కాంగ్రెస్ క్యాడర్, నాయకులు అంతా పొంగులేటితో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారని.. హస్తం పార్టీలో చేరితే అధిక స్థానాలు గెలిచే అవకాశాలే ఎక్కువని.. ఆ విషయం కచ్చింగా పొంగులేటికి తెలుసని.. కాబట్టి కాంగ్రెస్ లో పక్కా చేరుతారని పందెం రాయుళ్లు విశ్లేషణ కూడా చేస్తున్నట్లు సమాచారం. ఇక మరికొందరేమో కొత్త పార్టీ పెడతారని, ఇంకొందరేమో ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఏదైనా పార్టీలో చేరుతానే పందెం కాస్తున్నారట..
ఏజెన్సీల ఓపీనియన్ పోల్స్..
ఇక కొన్ని ఏజెన్సీలు, సంస్థలు సోషల్ మీడియాలో ‘పొంగులేటి ఏపార్టీలో చేరుతారు..?’ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ పార్టీలో చేరితే బాగుంటుంది..’ ‘మీరైతే పొంగులేటిని ఏపార్టీలో చేరమని సజెస్ట్ చేస్తారు..?’ లాంటి ప్రశ్నలతో ప్రజల ఒపీనియన్ సేకరిస్తున్నాయి. ఇవి ఆయా సంస్థలే చేస్తున్నాయా..? లేక వేరే ఎవరైనా చేపిస్తున్నారా..? అనే విషయం స్పష్టత లేకున్నా.. పలు ఏజెన్సీలు మాత్రం శ్రీనివాసరెడ్డి పార్టీ మారే విషయమై ప్రజల నాడి పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ఇంతకీ ఏ పార్టీ..
వాస్తవానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్, బీజేపీలో చేరుతారని ఆయా పార్టీల ముఖ్చనేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయమై పలానా పార్టీలో చేరుతున్నట్లు పొంగులేటి కానీ, ఆయన ముఖ్య అనుచరులు కానీ ఎప్పుడూ ప్రచారం చేయలేదు. కానీ రెండు పార్టీల రాష్ట్ర, జాతీయ నేతలు మాత్రం టచ్ లో ఉన్నారని సమాచారం. అయితే కర్ణాటక ఎన్నికల ఫలితా నిర్ణయం తర్వాత పొంగులేటి నిర్ణయం తీసుకుంటారని తాజాగా ప్రచారం జరుగుతోంది. రెండు రోజుల క్రితం ముఖ్య అనుచరులతో జరిగిన రహస్య సమావేశంలో కూడా వారి ఒపీనియన్ తీసుకున్నట్లు.. పొంగులేటి మాత్రం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయనట్లు ప్రచారం జరుగుతుంది. మొత్తానికి ఆచితూచి అడుగులు వేస్తున్న పొంగులేటి త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటారని ఆయన అనుచరులు చెబుతున్న మాట.
Read more:
చిట్టి దేవేందర్‌రెడ్డిపై BRS హైకమాండ్ సీరియస్.. ఆ ఘటనతో పార్టీకి చెడ్డ పేరని తీవ్ర ఆగ్రహం!