ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్ వి.పి.గౌతమ్

by Kalyani |   ( Updated:2022-11-28 03:57:25.0  )
ధాన్యం కొనుగోళ్లు త్వరితగతిన పూర్తి చేయాలి : కలెక్టర్ వి.పి.గౌతమ్
X

దిశ, కూసుమంచి: రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం సేకరణ త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కూసుమంచి మండలం పాలేరు గ్రామంలో ఆదివారం కలెక్టర్ ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మంజూరు చేసిన కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలన్నారు. గన్ని బ్యాగులు, తేమ పరీక్ష పరికరం, తూర్పారబట్టే యంత్రం, టార్పాలిన్ లు అందుబాటులో ఉంచాలన్నారు. రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రయివేటు వ్యక్తులకు అమ్ముతున్నారా, అందరూ కేంద్రానికి తెచ్చి, అమ్ముతున్నారా అడిగి తెలుసుకున్నారు. రైతులు తెలియజేసే సమస్యలపై తగుచర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఎఫ్ఏక్యూ ప్రకారం తేమశాతం వచ్చేలా ధాన్యం ఆరబోసుకొని తేవాలన్నారు. తూర్పారబట్టాలని, తాలు లేకుండా చూడాలని అన్నారు. నాణ్యతను పాటించాలన్నారు. కేంద్రంలో ధాన్యాన్ని పరిశీలించి, తేమ శాతం తనిఖీ చేశారు. ఏ మిల్లుకు ట్యాగ్ చేసింది, రవాణా అవుతుందా అడిగి తెలుసుకున్నారు. కేంద్రంలో ఇప్పటి వరకు 36 మంది రైతుల నుంచి 1988.40 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు కేంద్ర సిబ్బంది కలెక్టర్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, డిఆర్డీఓ విద్యాచందన, డిసిఓ విజయ కుమారి, డిసిఎస్ఓ రాజేందర్, అధికారులు తదితరులు ఉన్నారు.

పరిసరాల పరిశుభ్రత పాటించాలి

పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఆదివారం కలెక్టర్ కూసుమంచి మండలం నేలపట్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమ అమలును తనిఖీ చేసి పాఠశాల ఆవరణను పరిశీలించారు. పాఠశాల ఆవరణ,క్రీడాప్రాంగణంలో గడ్డి, పిచ్చి మొక్కలు పెరిగి, పరిశుభ్రత లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా గడ్డి, పిచ్చి మొక్కలను తొలగించారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రం చేయాలని, విద్యార్థులకు క్రీడలపై ఆసక్తి కలిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడా ప్రాంగణాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, ఎస్డీసి దశరథం, కూసుమంచి ఎంపీవో రాంచందర్, గ్రామ కార్యదర్శి కోటి, అధికారులు తదితరులు ఉన్నారు.

Advertisement

Next Story

Most Viewed