ప్రభుత్వ పథకాలు కంటికి కనబడటం లేదా : ఎమ్మెల్యే సండ్ర ఆగ్రహం

by Sridhar Babu |
ప్రభుత్వ పథకాలు కంటికి కనబడటం లేదా : ఎమ్మెల్యే సండ్ర ఆగ్రహం
X

దిశ, సత్తుపల్లి : పేదరిక నిర్మూలనకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే ప్రభుత్వ పై విమర్శలు చేస్తూ ఉన్నారా, ప్రభుత్వ పథకాలు కంటికి కనిపించడం లేదా అని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఘాటుగా విమర్శించారు. మండల పరిధిలోని రామానగరం గ్రామానికి చెందిన ఒంటెద్దు వెంకటేశ్వర్లు ప్రమాదంలో మరణించగా వారికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉండటంతో ఇటీవల విడుదలైన రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా చెక్కులు ఆయన సతీమణి సరోజినీకి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 14 రకాల పింఛన్లతో పాటుగా రైతులకు రైతు బీమా, రైతుబంధు, కేసీఆర్ కిట్టుతో పాటు ఈనెల చివరిలో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకోవడానికి మూడు లక్షల రూపాయలు అందజేస్తున్నట్టు తెలిపారు.

పథకం సత్తుపల్లి మండలం రామానగర్ నుంచి ఈ పథకం ప్రారంభం అవుతుందని, దీనితోపాటుగా సత్తుపల్లి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రామానగరం గ్రామానికి రెండున్నర కోట్ల రూపాయలతో సీసీ రోడ్లు మంజూరు చేసిందన్నారు. ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి జరుగుతుంటే కొందరికి అభివృద్ధి కనపడటం లేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు యాగంటి శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ కూసం పూడి మహేష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ శీలపురెడ్డి హరికృష్ణ రెడ్డి, ఆర్యవైశ్య పట్టణ అధ్యక్షులు వనమా వాసు, కలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed