భద్రాద్రి వద్ద శాంతించిన గోదావరి

by Aamani |
భద్రాద్రి వద్ద శాంతించిన గోదావరి
X

దిశ,భద్రాచలం : భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టింది. మంగళవారం ఉదయం 7.32 గంటలకు 43 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక ప్రకటించారు. సాయంత్రం 5 గంటలకు 48 అడుగులకు పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. క్రమంగా పెరుగుతూ, బుధవారం ఉదయం 7 గంటలకు 50.6 అడుగులకు పెరిగింది. 10 గంటల వరకు నిలకడగా ఉన్న గోదావరి 11 గంటల నుంచి తగ్గుముఖం పట్టింది.

రాత్రి 9 గంటలకు 47.50 అడుగులు కి తగ్గడంతో అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక ఉపసంహరించారు. ఇంకా మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది.కాగా తాలిపేరు, కిన్నెరసాని ప్రాజెక్టులకు వరద నీరు తగ్గింది. బుధవారం రాత్రి 7 గంటలకు తాలిపేరు 13 గేట్లు రెండు అడుగుల మేర ఎత్తి 12,375 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్టు నుంచి వరద నీరు విడుదల చేయలేదు.ఎగువ నుంచి ఒక జీవం లేని మొసలి గోదావరిలో కొట్టుకుని భద్రాచలం వచ్చింది.

Advertisement

Next Story

Most Viewed