- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఘరానా దొంగల ముఠా అరెస్ట్..
by Sumithra |

X
దిశ క్రైమ్, భద్రాచలం : భద్రాచల పరిసర ప్రాంతాలైన మణుగూరు, సారపాక, ఖమ్మం ప్రాంతాలలో ఇళ్ళకి, దేవాలయాలకు వేసిన తాళాలను పగలగొట్టి గత కొంతకాలంగా చోరీలకు పాల్పడుతున్న భద్రాచలానికి చెందిన ముగ్గురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి పేర్లు మాలోతు విక్రమ్, బండారి సాయితేజ, సూరి పాక నాగరాజులను ఏఎస్పీ పరితోష్ పంకజ్ ఆదేశాల మేరకు ఈ ముగ్గురి పై నిఘా ఉంచగా సీసీ కెమెరాలలో చూసి భద్రాచల ఫారెస్ట్ చెక్ పోస్ట్ వద్ద వారిని పట్టుకున్నారు.
వారి దగ్గర నుంచి సుమారు ఆరుతులాల బంగారం, ఆటోరిక్షా, ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీరు గతంలో కూడా దొంగతనాలు చేసి జైలుశిక్ష అనుభవించి తిరిగి వచ్చిన తర్వాత కూడా ఇలా దొంగతనాలు చేస్తూనే ఉన్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచల టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు శ్రీకాంత్, మధు ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Next Story